Virat Kohli: మరో వివాదంలో కోహ్లీ.. రెస్టారెంట్లో అవమానించారని మండిపడుతున్న స్వలింగ సంపర్కులు

Virat Kohli’s Restaurant: స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వారిని సమాజం నుంచి బహిష్కరించడం ఐపీసీ 377 సెక్షన్ భారత

Virat Kohli: మరో వివాదంలో కోహ్లీ.. రెస్టారెంట్లో అవమానించారని మండిపడుతున్న స్వలింగ సంపర్కులు
Virat Kohli
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 15, 2021 | 6:24 PM

Virat Kohli’s Restaurant: స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. వారిని సమాజం నుంచి బహిష్కరించడం ఐపీసీ 377 సెక్షన్ భారత రాజ్యాంగానికి విరుద్ధమంటూ 2018 సెప్టెంబర్లో ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. అయినా వారికి సమాజంలో ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెందిన హోటల్ చైన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్వలింగ సంపర్కుల (LGBTQIA+) పట్ల హోటల్ యాజమాన్యం వివక్షను ప్రదర్శించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూణేలోని కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ అనే రెస్టారెంట్ స్వలింగ సంపర్కులకు ప్రవేశాన్ని నిరాకరించిందన్న ఆరోపణలపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజంలో అందరూ ఒకటేనని గతంలో సుప్రీం కోర్టే తెలిపిందని.. అయినప్పటికీ.. హోటల్ యాజమాన్యం వారి ప్రవేశాన్ని అడ్డుకోవడం హక్కులను ఉల్లంఘించినట్లేనని నెటిజన్లు మండిపడుతున్నారు. పలు రెస్టారెంట్లు స్వలింగ సంపర్కులను అవమానించడం పరిపాటిగా మారిందని.. దీనికి విరాట్ కోహ్లీ రెస్టారెండ్ కూడా మినహాయింపు కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీకి చెందిన ఇతర రెస్టారెండ్ బ్రాంచ్ లల్లోనూ స్వలింగ సంపర్కులకు ప్రవేశంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారని.. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై సోషల్ మీడియా వేదికగా కోహ్లీని టార్గెట్ చేస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. సమాజంలోని ప్రతిఒక్కరినీ సమానత్వంతో చూడాలని కోహ్లీకి హితవు పలుకుతున్నారు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌తో ఓటమి అనంతరం.. కోహ్లీ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ రెస్టారెంట్లు మరో వివాదంలో చిక్కుకోవడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:

T20 World Cup 2021: ఘోర అవమానం.! టీమిండియా ప్లేయర్స్‌కు దక్కని చోటు.. కెప్టెన్‌గా ఎవరో తెలుసా?

ind vs nz: జైపూర్‎లో పెరిగిన వాయి కాలుష్యం.. భారత్, న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‎పై నిర్వహణపై అనుమానం..!