T20 World Cup 2021: ఘోర అవమానం.! టీమిండియా ప్లేయర్స్‌కు దక్కని చోటు.. కెప్టెన్‌గా ఎవరో తెలుసా?
టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. 12 మంది ఆటగాళ్లతో కూడిన..
టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. 12 మంది ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో ఒక్క టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు చోటు దక్కలేదు. పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజామ్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. ఈ జట్టులో రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు నుంచి ఏ ఆటగాడికి చోటు దక్కకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఐసీసీ తమ జట్టుకు ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్‌లను ఎంపిక చేసింది. టాప్ ఆర్డర్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ఎప్పుడూ ఆల్ టైం పర్ఫెక్ట్. ఈ టోర్నీలో డేవిడ్ వార్నర్ 48.16 సగటుతో 289 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలవగా.. జోస్ బట్లర్ 89.66 సగటుతో 269 పరుగులు చేశాడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు: బాబర్ ఆజామ్(కెప్టెన్), చరిత్ అసలంక, ఐడెన్ మార్క్‌రమ్.. ఈ టోర్నీలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్‌గా రిజ్వాన్‌తో కలిసి పలు కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. మొత్తంగా 60.60 సగటుతో 303 పరుగులు చేశాడు. అటు చరిత్ అసలంక 46.20 సగటుతో 231 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడాన్ మార్క్రామ్ 54 సగటుతో 162 పరుగులు చేశాడు. ఆ తర్వాత మొయిన్ అలీని(131. 42 స్ట్రైక్ రేట్‌తో 92 పరుగులు, 11 సగటుతో 7 వికెట్లు), బౌలర్లుగా వనిందు హసరంగా, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, ఎన్రిక్ నోర్కియాలను ఎంపిక చేసింది. ఇక 12వ ప్లేయర్‌గా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని తీసుకుంది.
మరోవైపు శ్రీలంక ఆటగాడు హసరంగ 16 వికెట్లతో టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అటు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ జంపా 13 వికెట్లు, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 11 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ 13 వికెట్లు తీయగా, దక్షిణాఫ్రికా ప్లేయర్ ఎన్రిక్ నోర్కియా 11.55 సగటుతో 9 వికెట్లు పడగొట్టాడు.
Also Read:
ఈ 3 రాశులవారు ఏ కష్టమొచ్చినా అబద్దం చెప్పరట.. అందులో మీరున్నారా.!
21 సిక్సర్లు, 16 ఫోర్లు.. సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఆ ఆటగాడు ఎవరంటే.!
Viral News: గోడ నుంచి వింత శబ్దాలు.. బద్దలు కొట్టి చూడగా రెస్క్యూ సిబ్బంది ఫ్యూజులు ఔట్.!
Moeen Ali & @josbuttler named in the @ICC team of the men’s @T20WorldCup. @babarazam258 is the captain of a side including 3 players from champions #Australia. #bbccricket #T20WorldCupFinal pic.twitter.com/INn2zvTYVp
— Test Match Special (@bbctms) November 15, 2021