Virat Kohli: మరోసారి ‘డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి? షాక్‌లో ఫ్యాన్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించిన మార్ఫింగ్ వీడియోలు గతంలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమెనే కాదు ప్రధాని మోడీతో మొదలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడుతున్నారు. ఇప్పుడు టీమ్ ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ టార్గెట్ గా..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించిన మార్ఫింగ్ వీడియోలు గతంలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమెనే కాదు ప్రధాని మోడీతో మొదలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా డీప్ ఫేక్ వీడియోల బారిన పడుతున్నారు. ఇప్పుడు టీమ్ ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ టార్గెట్ గా అలాంటి డీప్ ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో కోహ్లీ తన సహచర క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు చిత్రీకరించారు. ఒక ఇంటర్వ్యూలోని స్నిప్పెట్‌లను ఉపయోగించి ఈ డీప్‌ఫేక్ వీడియోను రూపొందించారు. ఇందులో తనతో శుభ్ మన్ గిల్ ను పోల్చడంపై కింగ్ కోహ్లీ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసినట్లు చూపించారు. ‘నేను గిల్‌ని చాలా ఏళ్లుగా దగ్గర నుంచి చూస్తున్నాను. నిస్సందేహంగా అతను ప్రతిభావంతుడైన ఆటగాడు. కానీ అతను లెజెండ్‌గా మారడానికి చాలా దూరంగా ఉన్నాడు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతం. అయితే, అతను నా కంటే ముందుకు వెళ్లలేడు. తదుపరి విరాట్ కోహ్లి శుభ్‌మన్ గిల్ అని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఒక్కడే’ అంటూ కోహ్లీ చెప్పినట్లు ఈ డీప్ ఫేక్ వీడియోలో చూపించారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఇది డీప్ ఫేక్ వీడియో అని తెలియక కొందరు కింగ్ కోహ్లీపై విమర్శలు కురిపిస్తున్నారు. మరికొందరు ఇది AI డీప్ ఫేక్ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఏఐ దుర్వినియోగం గురించి, దాని పర్యావసనాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా కోహ్లీ డీప్ ఫేక్ బారిన పడడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ఒక బెట్టింగ్ యాప్ ను కోహ్లీ ప్రమోట్ చేసినట్లు డీప్ ఫేక్ వీడియోను రూపొందించారు. ఇప్పుడు ఏకంగా శుభ్ మన్ గిల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు చూపించారు. దీంతో ఈ డీప్ ఫేక్ వీడియోలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వైరలవుతోన్న విరాట్ కోహ్లీ డీప్ ఫేక్ వీడియో ఇదే..
AI is Dangerous pic.twitter.com/njUvwiwc4t
— Cricketopia (@CricketopiaCom) August 27, 2024
శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఆడిన విరాట్ కోహ్లీ వచ్చే దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ టోర్నీలో భారత టెస్టు జట్టు ఆటగాళ్లు పాల్గొనాలని బీసీసీఐ సూచించింది. అయితే సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లకు మినహాయింపు ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ద్వారా విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి రానున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో టీమిండియా 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది, ఈ సిరీస్ ద్వారా టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమనే నమ్మకంతో ఉంది.
లండన్ లో కోహ్లీ, అనుష్క దంపతులు..
Virat Kohli & @AnushkaSharma at @KrishnaDas‘ Kirtan in London! 😇#ViratKohli • #Virushka • #ViratGang pic.twitter.com/efk3dYheFh
— ViratGang.in (@ViratGangIN) July 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..