Virat Vs BCCI: ఇలాంటి వివాదాలు ఆటగాళ్లను ఇబ్బంది పెడతాయి.. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ వ్యాఖ్యలు..
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు భారత క్రికెట్లో వివాదంగా మారాయి. దీనిపై మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు స్పందిస్తున్నారు...
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు భారత క్రికెట్లో వివాదంగా మారాయి. దీనిపై మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు స్పందిస్తున్నారు. ఇప్పుడు కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ మాట్లాడారు. కోహ్లికి చిన్నప్పటి నుంచి టీమ్ ఇండియాకు వచ్చే వరకు మద్దతుగా నిలిచిన రాజ్‌కుమార్ శర్మ, వెటరన్ బ్యాట్స్‌మెన్‌ను సమర్థించాడు. అయితే అదే సమయంలో ఇరుపక్షాలు బలమైన ప్రకటనలకు దూరంగా ఉండాలని చెప్పాడు. “ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు ఎందుకంటే ఇది నేరుగా విరాట్‌కి సంబంధించినది. అయితే ఇరు పక్షాల నుంచి ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయకుంటే బాగుండేదని నా అభిప్రాయం. టీమ్ బాగానే ఉంది కాబట్టి అనవసరమైన వివాదాలు మాకు అవసరం లేదు” అని రాజ్‌కుమార్ శర్మ అన్నారు.
టీమిండియా సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు ఈ వివాదం తలెత్తడంపై ఈ మొత్తం వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణాఫ్రికాకు భారత్ బయలుదేరడానికి కొన్ని గంటల ముందు, కోహ్లీ విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన చేయడంతో రచ్చ మొదలైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాపైనా, విరాట్‌పైనా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే కోహ్లీపై ప్రభావం పడదని శర్మ అభిప్రాయపడ్డారు. “ఇది అతని మనస్సులో ఉండవచ్చు, కానీ అతను ఒకసారి మైదానంలోకి వస్తే, దాని ప్రభావం ఏమీ ఉండదు. విరాట్ దేనికీ అత్యాశపరుడు. అతనికి చాలా నమ్మకం ఉంది. అతను 100 శాతం రాణిస్తాడు.” అని చెప్పారు.
ఇలాంటి వివాదాలు ఆటగాళ్లను ఇబ్బంది పెడుతాయని వెటరన్ కోచ్ కూడా అంగీకరించినప్పటికీ, అదే సమయంలో బోర్డు దాన్ని పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. “ఖచ్చితంగా ఇలాంటి వివాదం లేదా ఘర్షణ ఏ ఆటగాడికైనా కలవరపెడుతుంది. కానీ బోర్డు ఈ పరిస్థితిని చక్కగా ఎదుర్కొంటుందని మరియు ఇది ఎక్కువ కాలం ఉండదని నేను ఆశిస్తున్నాను. అని అన్నారు.
Read Also.. Sachin Tendulkar: భారత క్రికెట్‌లోకి సచిన్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?