Virat Vs BCCI: కెప్టెన్సీ వివాదంపై గంగూలీ వివరణ ఇవ్వాలి.. సమస్యను పరిష్కరించాలి..
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య విభేదాలు వివాదాస్పదం కాదని, అభిప్రాయానికి సంబంధించిన అంశమని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నారు...
భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య విభేదాలు వివాదాస్పదం కాదని, అభిప్రాయానికి సంబంధించిన అంశమని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నారు. విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్‌గా తొలగించారు. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ANIతో మాట్లాడుతూ నాయకత్వ మార్పుకు సంబంధించి తాను నిజంగానే కోహ్లీతో మాట్లాడానని, టీ20 కెప్టెన్సీని కూడా వదులుకోవద్దని అభ్యర్థించానని చెప్పాడు. అయితే, కోహ్లి బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి అందులో, మాజీ వైట్-బాల్ కెప్టెన్ గంగూలీకి విరుద్ధంగా చెప్పాడు. టీ20 కెప్టెన్సీని విడిచిపెట్టవద్దని తనను ఎప్పుడూ అడగలేదని అన్నాడు.
“ఈ పరిస్థితి మెరుగు అవ్వాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది వివాదం కాదు, అభిప్రాయానికి సంబంధించినది. సౌరవ్ విరాట్‌తో ఏమి చెప్పాడో నాకు తెలియదు కాబట్టి నేను దానిపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ నేను అనుకుంటున్నాను. సౌరవ్ ప్రెసిడెంట్‌గా ఉన్నందున బయటకు వచ్చి వివరణ ఇవ్వాలి. అది మొత్తం సమస్యకు ముగింపు అవుతుంది. దక్షిణాఫ్రికా పర్యటన మానకు ముఖ్యమైన సిరీస్ కాబట్టి టీం ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టాలి. ” అని మదన్ లాల్ ANI కి చెప్పాడు. కోహ్లీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి సమస్యను క్లియర్ చేసుకోవాలని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను అని మదన్ లాల్ అన్నారు.
“గవాస్కర్ సరైనదే. విరాట్ తన సమస్యలన్నింటినీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి. ఇదేం పెద్ద విషయం కాదు. సెలెక్టర్లు పరిస్థితిని మెరుగయ్యేలా చేయాలి. నిర్ణయం తీసుకునే ముందు సెలెక్టర్లు విరాట్‌తో మాట్లాడారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు” అని మదన్ లాల్ అన్నాడు. మరోవైపు, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత రెడ్-బాల్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రోటీస్‌తో పోటీ పడనుంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
Read Also.. Virat Vs BCCI: ఇలాంటి వివాదాలు ఆటగాళ్లను ఇబ్బంది పెడతాయి.. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ వ్యాఖ్యలు..