AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: నువ్వు దేవుడు అందించిన వరం సామీ.. ఏ కప్‌లు, టైటిళ్లు నీ ఘనతను వర్ణించలేవు.. రోనాల్డోపై కోహ్లీ ఎమోషనల్‌

ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ అభిమానులు రోనాల్డోకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రపంచకప్‌ గెలిచినా, గెలవకపోయినా తమ మనసుల్లో ఎప్పటికీ ఉంటావంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఇక రొనాల్డోకు వీరాభిమాని అయిన టీమిండియా మాజీ కెప్టెన్‌ కింగ్‌ కోహ్లీ కూడా సాకర్‌ దిగ్గజానికి బాసటగా నిలిచాడు.

Virat Kohli: నువ్వు దేవుడు అందించిన వరం సామీ.. ఏ కప్‌లు, టైటిళ్లు నీ ఘనతను వర్ణించలేవు.. రోనాల్డోపై కోహ్లీ ఎమోషనల్‌
Cristiano Ronaldo, Kohli
Basha Shek
|

Updated on: Dec 12, 2022 | 3:44 PM

Share

ఫిఫా ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న క్రిస్టియానో ​రొనాల్డో కల మరోసారి చెదిరిపోయింది. ఖతార్‌ వేదికగా జరగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో 0-1 తేడాతో పోర్చుగల్‌ ఓడిపోయింది. దీంతో మొదటిసారి టైటిల్‌ గెలవాలనుకున్న ఆ జట్టు టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. కాగా ఈ పరాజయంతో పోర్చుగల్ జట్టు కెప్టెన్‌, స్టార్‌ ప్లేయర్‌ రొనాల్డో గుండె చెదిరిపోయింది. ఓటమిని తట్టుకోలేక మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యడీ సాకర్‌ స్టార్‌. ప్రత్యర్థి ఆటగాళ్లు ఓదారుస్తున్నా గుండెల్లోని బాధను అణుచుకోలేకపోయాడు.కాగా 37 ఏళ్ల రొనాల్డోకు ఇదే ఆఖరి వరల్డ్‌ కప్‌ అని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో అతను చిన్నపిల్లాడిలా ఏడ్చుకుంటూ డ్రెస్సింగ్‌ రూంకు వెళుతున్న వీడియోలు, ఫొటోలు ఇది అందరినీ కలిచివేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ అభిమానులు రోనాల్డోకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రపంచకప్‌ గెలిచినా, గెలవకపోయినా తమ మనసుల్లో ఎప్పటికీ ఉంటావంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. ఇక రొనాల్డోకు వీరాభిమాని అయిన టీమిండియా మాజీ కెప్టెన్‌ కింగ్‌ కోహ్లీ కూడా సాకర్‌ దిగ్గజానికి బాసటగా నిలిచాడు. సోషల్‌ మీడియా వేదికగా అతనిపై ప్రశంసలు కురిపిస్తూ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు.

ప్రతి ఆటగాడికి నిజమైన ఆదర్శం నువ్వే..

‘ఈ ఆటలో మీరు సాధించిన ఘనతలు, అభిమానులకు అందించిన స్ఫూర్తిని ఏ ట్రోఫీగానీ లేదా టైటిల్‌గానీ దూరం చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులపై మీరు చూపిన ప్రభావాన్ని.. మీ ఆటను చూసినప్పుడు మాకు కలిగే అనుభూతిని ఏ కప్‌ లేదా టైటిల్‌ వర్ణించలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ నీ కఠోర శ్రమ, నీ అంకితభావం మాకు కనిపిస్తూనే ఉన్నాయి. వందకు వంద శాతం ఆటకు న్యాయం చేయడమే పరమావధిగా భావించగలగడం ఆటగాడికి దక్కిన బహుమతి లాంటిది. ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి నువ్వే నిజమైన ఆదర్శం. ఇక నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడి(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌- GOAT)వి నువ్వే’ రొనాల్డోపై అభిమానాన్ని చాటుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోనాల్డోకు మద్దతునిస్తూ క్రీడాభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..