MS Dhoni: మిస్టర్ కూల్‌ మోస్ట్‌ లక్కీయెస్ట్‌ ఫ్యాన్‌ ఇతనేనేమో.. నెట్టింట వైరలవుతోన్న ధోని వీడియో

కెప్టెన్‌ కూల్‌ను ప్రేమించే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. అతను ఎక్కడ కనిపించినా ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పోటీపడుతుంటారు. ధోని కూడా అభిమానులను ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తాడు. వారిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఎంతో ఓపికగా ఆటోగ్రాఫ్‌, ఫొటోగ్రాఫ్‌లు ఇస్తుంటాడు.

MS Dhoni: మిస్టర్ కూల్‌ మోస్ట్‌ లక్కీయెస్ట్‌ ఫ్యాన్‌ ఇతనేనేమో.. నెట్టింట వైరలవుతోన్న ధోని వీడియో
Ms Dhoni
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2022 | 5:08 PM

ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మిస్టర్‌ కూల్‌ ధోని ముందుంటాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ అతని ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఇప్పటికీ తగ్గలేదు. కెప్టెన్‌ కూల్‌ను ప్రేమించే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. అతను ఎక్కడ కనిపించినా ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పోటీపడుతుంటారు. ధోని కూడా అభిమానులను ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తాడు. వారిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఎంతో ఓపికగా ఆటోగ్రాఫ్‌, ఫొటోగ్రాఫ్‌లు ఇస్తుంటాడు. ఈక్రమంలో ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇందులో జార్ఖండ్‌ డైనమేట్‌ తన అభిమాని టీ షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ ఇస్తూ కనిపించాడు. ఇది చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఆటో గ్రాఫ్‌ తీసుకున్న వ్యక్తిని.. ‘భయ్యా.. నువ్వు చాలా లక్కీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అప్పుడప్పుడూ వెకేషన్స్‌కు కూడా వెళ్తూ సేదతీరుతున్నారు. ఇటీవల కేదార్ జాదవ్‌, రుతురాజ్ గైక్వాడ్‌లతో కలిసి ఎస్‌యూవీలో తిరుగుతూ కనిపించాడు. అలాగే దుబాయ్‌లో హార్దిక్ పాండ్యా, రాపర్ బాద్షాతో కలిసి సందడి చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వైఫల్యంతో ధోనిని కోచ్ గా నియమించాలని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అటు ధోనీ కాని, బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..