Virat Kohli: ప్లీజ్ నన్ను అలా పిలవకండి.. ఆ ట్యాగ్ నాకొద్దు, RCB ఫ్యాన్స్ కు విరాట్ కోహ్లీ రిక్వెస్ట్
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ అనగానే చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చేది కింగ్ కోహ్లీనే. టెస్టు అయినా, వన్డే అయినా, టీ20 అయినా పరుగుల వరద పారాల్సిందే. అందుకే కోహ్లికి కింగ్ అని పేరొచ్చింది. లోకల్ నాన్ లోకల్ గ్రౌండ్ ఏదైనా కోహ్లీ రాణిస్తుండటంతో అభిమానులు ముద్దుగా అలా పిలుచుకుంటున్నారు.

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ అనగానే చాలామందికి మొదటగా గుర్తుకు వచ్చేది కింగ్ కోహ్లీనే. టెస్టు అయినా, వన్డే అయినా, టీ20 అయినా పరుగుల వరద పారాల్సిందే. అందుకే కోహ్లికి కింగ్ అని పేరొచ్చింది. లోకల్ నాన్ లోకల్ గ్రౌండ్ ఏదైనా కోహ్లీ రాణిస్తుండటంతో అభిమానులు ముద్దుగా అలా పిలుచుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన అభిమానులను ఓ సందేశం పంపారు. తనను ‘కింగ్’ అని పిలవడం మానేయాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) స్టార్ విరాట్ అభిమానులను కోరాడు. మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్‌సీబీ ఈవెంట్‌లో ప్రేక్షకులను ఉద్దేశించి కోహ్లీ ఈ విజ్ఞప్తి చేశాడు.
RCB ఈవెంట్‌లో తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) విజయం తర్వాత స్మృతి మంధాన & కో. చిన్నస్వామి వద్ద RCB పురుషుల జట్టు నుండి ప్రత్యేక గౌరవం అందుకుంది. అయితే, కోహ్లి ఎట్టకేలకు మైక్ తీసుకొని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సందర్భంగా కోహ్లీ తన కోసం ‘కింగ్’ ట్యాగ్‌ని ఉపయోగించవద్దని అభిమానులను కోరాడు. మాజీ RCB కెప్టెన్ ఐపీఎల్ లో జట్టు గెలుపు కోసం ఎంతో శ్రమించాడు. ఈ కారణంగానే అభిమానులు కింగ్ అనే ట్యాగ్ ఇచ్చారు.
దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను క్రికెట్ దేవుడు అని పిలుస్తుండగా, కోహ్లీ కింగ్ అయ్యాడు. అయితే, కోహ్లి కింగ్ పిలవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అభిమానులు ఆ ట్యాగ్‌ను తొలగించాలని కోరుకుంటున్నారు. నన్ను విరాట్ అని పిలిస్తే చాలు అని అన్నాడు. మళ్లీ జట్టులోకి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందని కోహ్లీ అన్నాడు. అయితే కోహ్లీ ప్రాక్టీస్ సమయంలో ఎక్కడా లేని సందడి నెలకొంది.
We Play for the Badge ❤️🔥
Presenting jaw dropping clicks from our team photoshoot! More to follow…🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/OEZBYjk1y9
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024