AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అరుదైన ప్రపంచ రికార్డ్ భయ్యో..!

Virat Kohli Records: ఐపీఎల్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఏప్రిల్ 24న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్ కూడా సాధించలేని అత్యుత్తమ మైలురాయిని చేరుకోవడానికి అతడు కేవలం కొన్ని పరుగుల దూరంలో మాత్రమే నిలిచాడు.

Virat Kohli: క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అరుదైన ప్రపంచ రికార్డ్ భయ్యో..!
Ipl 2026 Rcb Virat Kohli
Venkata Chari
|

Updated on: Apr 21, 2026 | 7:49 AM

Share

Virat Kohli Records: భారత క్రికెట్ జట్టు అగ్రశ్రేణి ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మరో భారీ రికార్డును బద్దలు కొట్టే అంచున ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 24న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. ఈ ఉత్కంఠభరితమైన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం మెండుగా ఉంది. ఇది అసాధారణమైన ఫీట్ అని, ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌లో మరే ఇతర ఆటగాడు ఈ ఘనతను సొంతం చేసుకోలేకపోయారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

9000 పరుగుల మైలురాయి లక్ష్యంగా..

ఏప్రిల్ 24న గుజరాత్ టైటాన్స్‌పై జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో 92 పరుగులు సాధిస్తే, ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రపంచంలో మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఈ భారీ రికార్డు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. కోహ్లీ ఈ ఘనతను సాధిస్తే, ఐపీఎల్ టీ20 లీగ్ చరిత్రలో తన కీర్తి కిరీటంలో మరొక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకుంటాడు.

అగ్రస్థానంలో సత్తా చాటుతున్న కింగ్..

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన దిగ్గజాల జాబితాలో విరాట్ కోహ్లీ ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 273 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 39.76 సగటుతో అత్యధికంగా 8908 పరుగులు నమోదు చేశాడు. ఈ పట్టికలో రెండవ స్థానంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు 276 మ్యాచ్‌లలో 29.92 సగటుతో 7183 పరుగులు సాధించాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాట్స్‌మెన్స్:

విరాట్ కోహ్లీ (భారత్) – 273 మ్యాచ్‌లలో 8908 పరుగులు

రోహిత్ శర్మ (భారత్) – 276 మ్యాచ్‌లలో 7183 పరుగులు

శిఖర్ ధావన్ (భారత్) – 222 మ్యాచ్‌లలో 6769 పరుగులు

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 184 మ్యాచ్‌లలో 6565 పరుగులు

సురేష్ రైనా (భారత్) – 205 మ్యాచ్‌లలో 5528 పరుగులు

ఈ సీజన్‌లోనూ కొనసాగుతున్న కోహ్లీ జోరు..

2026 ఐపీఎల్ సీజన్‌లోనూ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో విజృంభిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీల సహాయంతో 49.40 సగటుతో 247 పరుగులు సాధించాడు. తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సర్వసన్నద్ధమై బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరు మ్యాచ్‌లకు గాను నాలుగు విజయాలు, రెండు ఓటములతో ఎనిమిది పాయింట్లు సాధించి రెండవ స్థానంలో కొనసాగుతోంది. జట్టు నెట్ రన్‌రేట్ +1.171 గా ఉంది. ఏదేమైనా తదుపరి మ్యాచ్‌లో కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొడతాడా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us