Virat Kohli: దాస్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన విరాట్.. బంగ్లా క్రికెటర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?
బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అయితే కొద్ది సేపు టీమిండియా బౌలర్లను కంగారు పెట్టించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు. అతను కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం.
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పోరాడి ఓడింది. ఇక బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అయితే కొద్ది సేపు టీమిండియా బౌలర్లను కంగారు పెట్టించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు. అతను కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. ఆపై వర్షం కురవడం, దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో లిటన్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఇక్కడే మ్యాచ్ రోహిత్ సేన వైపు మలుపు తిరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా పరాజయం పాలైనా లిటన్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. పలువురు ప్రముఖులు దాస్‌ను అభినందించారు.ఈనేపథ్యంలో మన రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ కూడా దాస్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయ్యాడు. తన బ్యాట్‌ను బంగ్లాక్రికెటర్‌కు బహుమతిగా ఇచ్చాడు.
ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ వెల్లడించాడు. ‘మేం డైనింగ్ హాల్‌లో ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ వచ్చి లిటన్‌కు తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది నిజంగా లిటన్‌కు మధురమైన క్షణం’ అని జలాల్ యూనస్ తెలిపాడు. ఇదే మ్యాచ్‌లో కోహ్లి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 64 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. కాగా సూపర్ 12 చివరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది టీమిండియా. ఆదివారం (నవంబర్6)న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌లో టీమిండియా స్థానం ఖరారు కావడంతో పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
Looking forward to the first world cup match ?✊?? #T20WorldCup pic.twitter.com/dAXA88hZyp
— Litton Das (@LittonOfficial) October 23, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..