T20 World Cup: ఆ గండం నుంచి గట్టెక్కాలంటే జింబాబ్వేపై మనం తప్పక గెలవాల్సిందే.. చరిత్ర అదే చెబుతోంది మరి..

టీ 20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ సెమీస్‌ ఎంట్రీతో టీమ్ ఇండియా ఇప్పుడు జింబాబ్వేపై తప్పక గెలవాల్సి ఉంది. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌పై టీమిండియా రికార్డులు దారుణంగా ఉన్నాయి.

T20 World Cup: ఆ గండం నుంచి గట్టెక్కాలంటే జింబాబ్వేపై మనం తప్పక గెలవాల్సిందే.. చరిత్ర అదే చెబుతోంది మరి..
Team India
Follow us

|

Updated on: Nov 04, 2022 | 3:48 PM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించిన తొలి జట్టుగా అవతరించింది. అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించి న్యూజిలాండ్ సెమీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. కెప్టెన్ విలియమ్సన్ 35 బంతుల్లో 61 పరుగులతో వేగంగా అర్ధ సెంచరీతో కివీస్‌కు విజయాన్ని అందించాడు. కాగా న్యూజిలాండ్ సెమీస్‌ ఎంట్రీతో టీమ్ ఇండియా ఇప్పుడు జింబాబ్వేపై తప్పక గెలవాల్సి ఉంది. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌పై టీమిండియా రికార్డులు దారుణంగా ఉన్నాయి. గత టీ20 ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. 2019 ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్‌ విజయం సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ కూడా భారత్‌ను ఓడించి మొదటి ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌ భారత్‌ను ఓడించింది. అలాగే 2007 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో భారత జట్టు ఓడిపోయింది.

కాబట్టి ఇప్పుడు సెమీస్‌లో భారత్‌ న్యూజిలాండ్‌తో ఆడకుండా ఉండాలంటే జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో టీం ఇండియా గెలిచి అగ్రస్థానంలో నిలవాలి. T20 ప్రపంచ కప్ 2022 నియమాల ప్రకారం, గ్రూప్ 1 నుండి అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీ-ఫైనల్‌లో గ్రూప్ 2 నుండి రెండవ ర్యాంక్ జట్టుతో పోటీపడుతుంది. ఇప్పుడు తమ గ్రూప్‌ న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే అగ్రస్థానంలో ఉండటంతో ఆ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇందుకోసం టీమ్ ఇండియా తన గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలవాలి. అందుకోసం జింబాబ్వేపై కచ్చితంగా గెలవాలి. ఇది జరిగితే రోహిత్ సేన సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్‌తో తలపడనుంది. నాకౌట్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ కంటే ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్ భారత్‌కు సులభమైన ప్రత్యర్థులు. గతంలో ఈ రెండు జట్లపై భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించింది. అలాగే స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. సో.. సెమీస్‌లో కివీ గండం నుంచి గట్టెక్కాలంటే జింబాబ్వేపై మనం కచ్చితంగా గెలవాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..