Virat Kohli: వన్డేల్లో 50 సెంచరీలు.. క్రికెట్ గాడ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ..
బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ 50 వన్డే సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ 50 వన్డే సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో కోహ్లీ డబుల్‌తో మైలురాయిని అందుకున్నాడు.
ఈ రోజు బ్లాక్ క్యాప్స్‌పై ఈ మ్యాచ్‌కు ముందు, కోహ్లి 49 సెంచరీలతో జాబితాలో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్‌తో సమానంగా ఉన్నాడు.
ఈ రోజు తన వండర్‌ఫుల్ ఇన్నింగ్స్‌లో, ఒకే వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ కెరీర్‌లో ఇది 50వ సెంచరీ. వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 100 పరుగుల మార్క్‌ను దాటిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు.
View this post on Instagram
మ్యాచ్ విషయానికి వస్తే.. వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న భారత జట్టు.. వార్త రాసే సమయానికి 44 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. విరాట్ 117 పరుగుల తర్వాత పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్‌తో 150+ భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇరుజట్లు:
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








