RCB IPL 2023: ఇకపై కోహ్లీ స్థానమదే.. రాబోయే సీజన్ నుంచే షురూ.. కీలక విషయం బయటపెట్టిన ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వెటరన్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ తదుపరి సీజన్‌లో జట్టు కోసం ఓపెనింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లీ, డు ప్లెసిస్‌ల జోడీ ఓపెనింగ్‌ను చూడవచ్చని జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ సూచించాడు.
IPL 2023 వేలం సమయంలో RCB ఇంగ్లాండ్‌కు చెందిన విల్ జాక్వెస్, రీస్ టాప్లీలను ఎంపిక చేసింది. జాక్వెస్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేసింది. అతను రీస్ టాప్లీని కూడా ఎంచుకున్నాడు. టాప్లీ ఒక పొడవైన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అతను చాలా బలమైన బౌలర్‌గా నిరూపించుకోగలడు.
ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ..
విల్ జాక్వెస్, రీస్ టాప్లీలను కొనుగోలు చేయడం వెనుక ఉన్న వ్యూహాన్ని మైక్ హెస్సన్ వివరించాడు. విరాట్ కోహ్లీ ఓపెనింగ్ గురించి కూడా సూచించాడు. ‘రీస్ టాప్లీకి ఎలాంటి నైపుణ్యం, క్రాఫ్ట్ ఉందో మాకు తెలుసు. ఈ ప్లేయర్‌ను ఒక కోటి 90 లక్షలకు కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అతని రాక జట్టు సమతూకాన్ని మెరుగుపరుస్తుంది. రూ.3-4 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అనుకున్నాం. కానీ, అది జరగలేదు. అందుకే విల్ జాక్స్ కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి మా కోసం ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది” అంటూ తెలిపాడు.
IPL 2023 కోసం మినీ వేలం ముగిసింది. ఈ సమయంలో అన్ని జట్లు తమ జట్టును తదుపరి సీజన్‌లో బలోపేతం చేయడానికి పనిచేశాయి. సామ్ కరణ్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకుపైగా వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో పాటు బెన్ స్టోక్స్, కెమరూన్ గ్రీన్, నికోలస్ పూరన్‌లపై కూడా డబ్బుల వర్షం కురిసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..