- Telugu News Photo Gallery Cricket photos Inspirational story of Shaik Rasheed from Guntur District who Sold to CSK For 20 Lakh at IPL Mini Auction
IPL 2023: బాల్ కొనడానికి డబ్బుల్లేవ్.. కట్ చేస్తే ధోనీ టీంలోకి ఎంట్రీ.. గుంటూరు కుర్రాడి సక్సెస్ స్టోరీ
ఇక రషీద్‌ను క్రికెట్ కోచింగ్‌కు తీసుకెళ్లడం కోసం అతని తండ్రి ఉద్యోగం కూడా పోగొట్టుకున్నారట. రోజూ 50 కి.మీ. ప్రయాణం చేయాల్సి రావడంతో రోజూ ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లేవారట. దీంతో మాటలు పడలేక జాబ్‌ను వదిలిపెట్టేశారట.
Updated on: Dec 24, 2022 | 1:49 PM

కొచ్చిలో జరిగిన IPL 2023 మినీ వేలంలో గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్‌ను మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను కొనుగోలు చేసింది

18 ఏళ్ల షేక్ రషీద్ ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాడు. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. ముఖ్యంగా ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.

రషీద్‌కు ట్యాలెంట్ ఉన్నా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఒకానొక సమయంలో ప్రాక్టీస్ చేసేందుకు మంచి లెదర్ బాల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవట.

ఇక రషీద్‌ను క్రికెట్ కోచింగ్‌కు తీసుకెళ్లడం కోసం అతని తండ్రి ఉద్యోగం కూడా పోగొట్టుకున్నారట. రోజూ 50 కి.మీ. ప్రయాణం చేయాల్సి రావడంతో రోజూ ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లేవారట. దీంతో మాటలు పడలేక జాబ్‌ను వదిలిపెట్టేశారట.

కాగా త్వరలోనే ఈ యంగ్ ప్లేయర్ ఐపీఎల్‌లో కనిపించనున్నాడు. క్రికెట్ దిగ్గజం ధోనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోనున్నాడు.దీంతో అతని స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి.