భారత్, ఆసీస్ మ్యాచ్‌లో మాల్యా

లండన్: వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. ఇంగ్లండ్‌లో జరగుతున్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా ఓవల్‌ వేదికగా జరగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ చూసేందుకు మైదానానికి వచ్చి మీడియా కంటికి చిక్కాడు. దీంతో మాల్యాను ఎగవేత, అప్పగింతపై మీడియా ప్రశ్నించగా తాను మ్యాచ్‌ చూసేందుకు వచ్చానని చెప్పి స్టేడియం లోపలకు వెళ్లిపోయాడు. ఇక విజయ్ మాల్యా అప్పగింత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. విజయ్ మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ […]

భారత్, ఆసీస్ మ్యాచ్‌లో మాల్యా
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 09, 2019 | 8:25 PM

లండన్: వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా.. ఇంగ్లండ్‌లో జరగుతున్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా ఓవల్‌ వేదికగా జరగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ చూసేందుకు మైదానానికి వచ్చి మీడియా కంటికి చిక్కాడు. దీంతో మాల్యాను ఎగవేత, అప్పగింతపై మీడియా ప్రశ్నించగా తాను మ్యాచ్‌ చూసేందుకు వచ్చానని చెప్పి స్టేడియం లోపలకు వెళ్లిపోయాడు.

ఇక విజయ్ మాల్యా అప్పగింత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. విజయ్ మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి. అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు. లండన్ హై కోర్టులో జూలై 2న విచారణ ఉంది. భారతీయ జైళ్లు సురక్షితం కావన్న వాదనతో కోర్టులో పోరాడుతున్నాడు. విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు దాదాపు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలుకు పారిపోయిన విషయం తెలిసిందే.