IPL 2025: మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే.. జాక్ పాట్ కొట్టిన టీమిండియా ప్లేయర్

Venkatesh Iyer: వెంకటేష్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ KKR విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే, మెగా వేలంలో రూ. 23.75 కోట్లతో తిరిగి తీసుకున్నారు. దీంతో ఈ సంవత్సరం వేలంలో మూడవ అత్యధిక ఆటగాడిగా నిలిచాడు.

IPL 2025: మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే.. జాక్ పాట్ కొట్టిన టీమిండియా ప్లేయర్
Kkr Ipl 2025
Follow us
Venkata Chari

|

Updated on: Nov 24, 2024 | 7:23 PM

IPL 2025: మధ్యప్రదేశ్ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 23.75 కోట్లతో దక్కించుకుంది. ఆదివారం సౌదీ అరేబియాలోని జెద్దాలోని అబాడి అల్ జోహార్ అరేనాలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో వెంకటేష్ అయ్యర్‌కు ఊహించని ప్రైజ్ దక్కించుకున్నాడు.

వెంకటేష్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ KKR విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే, మెగా వేలంలో రూ. 23.75 కోట్లతో తిరిగి తీసుకున్నారు. దీంతో ఈ సంవత్సరం వేలంలో మూడవ అత్యధిక ఆటగాడిగా నిలిచాడు.

కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన తీవ్రమైన బిడ్డింగ్ వార్‌లో చివరకు కేకేఆర్ గెలిచింది. క్యాప్డ్ ఆల్ రౌండర్ల సెట్ 4లో వెంకటేష్ అయ్యర్, అతని బేస్ ధర రూ. 2 కోట్ల కంటే 11 రెట్లు ఎక్కువగా దక్కించుకున్నాడు..

ఇవి కూడా చదవండి

KKR వేలానికి ముందు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 2021లో ఇదే ఫ్రాంచైజీతో IPL అరంగేట్రం చేసిన అయ్యర్.. మరోసారి కేకేఆర్ జట్టు తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..