AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 9 ఫోర్లతో ఊచకోత.. ఒక్క సిక్స్ లేకుండానే బౌలర్ల తాట తీసిన బుడ్డోడు..!

vaibhav sooryavanshi batting: చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై వైభవ్ సూర్యవంశీ చూపిన పరిణతి, భయమెరగని బ్యాటింగ్ తీరు చూస్తుంటే భారత క్రికెట్‌కు మరో సంచలన ఓపెనర్ దొరికాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అఫ్గాన్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ అతడు ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ భవిష్యత్తులో అతనికి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనడంలో అతిశయోక్తి లేదు.

Video: 9 ఫోర్లతో ఊచకోత.. ఒక్క సిక్స్ లేకుండానే బౌలర్ల తాట తీసిన బుడ్డోడు..!
Ind Vs Afg Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Jun 11, 2026 | 12:43 PM

Share

India a vs Afghanistan: శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడుతూ, మైదానం నలుమూలలా ఫోర్ల వర్షం కురిపించాడు. కేవలం 6 పరుగుల తేడాతో అర్ధశతకం చేజారినప్పటికీ, అతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

విధ్వంసకర ఇన్నింగ్స్.. బౌలర్లకు చుక్కలు!

శ్రీలంకలోని దంబుల్లా అంతర్జాతీయ మైదానంలో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే అఫ్గాన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకున్న ఈ యువ బ్యాటర్, కేవలం 22 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టాడు. ఇందులో ఏకంగా 9 అద్భుతమైన బౌండరీలు ఉండటం విశేషం. అంటే అతని ఇన్నింగ్స్‌లో 36 పరుగులు కేవలం ఫోర్ల రూపంలోనే వచ్చాయంటే అతడు ఎంతటి దూకుడు ప్రదర్శించాడో అర్థం చేసుకోవచ్చు. 200 స్ట్రైక్ రేట్‌తో సాగిన వైభవ్ బ్యాటింగ్ శైలి స్టేడియంలోని ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఫోర్ల సునామీ.. ఒక్క ఓవర్లోనే చెలరేగిపోయిన యువ కిరణం..

మహ్మద్ ఇబ్రహీం వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వైభవ్ సూర్యవంశీ వరుస ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆఫ్ స్టంప్‌కు వెలుపల పడిన బంతులను కళ్లు చెదిరే కట్ షాట్లు, కవర్ డ్రైవ్స్ ద్వారా సరిహద్దులు దాటించాడు. బౌలర్లు లెంగ్త్ మార్చినప్పటికీ ఏమాత్రం బెదరకుండా మిడ్ వికెట్ మీదుగా బాదిన షాట్లు ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. అయితే దురదృష్టవశాత్తూ అబ్దుల్లా అహ్మద్‌జాయ్ వేసిన ఒక షార్ట్ డెలివరీని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించి, వికెట్ కీపర్ ఇషాక్ రషీమికి క్యాచ్ ఇచ్చి వైభవ్ వెనుదిరిగాడు. అర్ధ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో అవుట్ కావడంతో వైభవ్ తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు.

భారత జట్టు భారీ స్కోరు.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుత పోరాటం..

మరోవైపు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపించాడు. బాధ్యతాయుతంగా ఆడి 69 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో 84 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ జట్టు 3 వికెట్ల నష్టానికి 174 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 29 పరుగులతో క్రీజులో ఉండగా, తిలక వర్మ 3 పరుగులతో నిలిచాడు. ప్రియాంశ్ ఆర్య 8 పరుగులకే పరిమితమయ్యాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us