IPL Auction 2026 : అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల పంట పండింది.. ఐపీఎల్ 2026 ఆక్షన్‌లో కోట్లకు పడగలెత్తిన యంగ్ స్టార్స్
IPL Auction 2026 : ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. విదేశీ స్టార్ ప్లేయర్‌ల కోసం జరిగిన పోటీతో పాటు, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా డబ్బు వెచ్చించి చరిత్ర సృష్టించాయి.

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. విదేశీ స్టార్ ప్లేయర్‌ల కోసం జరిగిన పోటీతో పాటు, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు భారీగా డబ్బు వెచ్చించి చరిత్ర సృష్టించాయి. ఈ వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాళ్లలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లే ముందుండటం విశేషం. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై ఊహించని పందెం వేసి, ఈ సీజన్‌లో అతిపెద్ద సంచలనాన్ని నమోదు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తమ భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళికతో వేలంలోకి దిగింది. ఇందులో భాగంగా ఇద్దరు యంగ్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల కోసం వారు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఖర్చు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో హోరాహోరీగా పోటీ పడిన CSK, చివరికి అతన్ని భారీ మొత్తంలో రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది.
ప్రశాంత్ వీర్‌ను కొనుగోలు చేసిన కొద్దిసేపటికే, CSK మరో యువ అన్‌క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మను కూడా అదే ధర రూ.14.20 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లుగా నిలిచి, రికార్డును పంచుకున్నారు. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయడానికి, తమ జట్టును పునర్నిర్మించుకోవడానికి CSK ఈ ఇద్దరు యువ ఆల్‌రౌండర్‌లపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.
ఈ వేలంలో మరో అద్భుతం జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ దార్. కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.8.40 కోట్లకు దక్కించుకుంది. ఇది అతని బేస్ ప్రైస్ కంటే 28 రెట్లు ఎక్కువ. దేశవాళీ క్రికెట్‌లో అతని నిలకడైన ఫాస్ట్ బౌలింగ్ ప్రదర్శన ఈ భారీ ధరకు కారణమైంది. అదేవిధంగా రాజస్థాన్ యువ వికెట్ కీపర్ ముకుల్ చౌదరిని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా వికెట్ కీపర్ బ్యాటర్ తేజస్వి సింగ్‌ను రూ.3 కోట్లకు దక్కించుకుంది.
ఈ భారీ కొనుగోళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల వ్యూహాన్ని మార్చాయి. సీనియర్, క్యాప్డ్ ప్లేయర్‌ల కంటే, యువ, దేశవాళీ స్టార్లపై పెట్టుబడి పెట్టడానికి జట్లు మొగ్గు చూపుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను తక్కువ వయసులో కొనుగోలు చేయడం ద్వారా, వారిని దీర్ఘకాలికంగా జట్టులో ఉంచుకోవచ్చు. ఐపీఎల్లో రాణించడానికి దేశవాళీ టోర్నమెంట్లైన SMAT, రంజీ ట్రోఫీలో మంచి ప్రదర్శనలే ముఖ్యమని ఫ్రాంచైజీలు నమ్ముతున్నాయి. విదేశీ స్టార్లపై భారీగా ఖర్చు చేసినప్పటికీ, పర్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి దేశవాళీ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే, టాలెంటెడ్ ప్లేయర్లు అయిన పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అథర్వ తైడే, యశ్ ధుల్, కొంతమంది అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్లు కమలేష్ నాగర్‌కోటి, తనుష్ కోటియన్ వంటి వారు అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం నిరాశ కలిగించింది. అయినప్పటికీ ప్రశాంత్ వీర్, ఔకిబ్ దార్ వంటి యువ ఆటగాళ్లకు దక్కిన భారీ మొత్తం, భారత క్రికెట్ స్ట్రాంగ్ యంగ్ టాలెంటును ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




