Pak vs Eng: పాక్‌ బ్యాటర్‌ పవర్‌ఫుల్‌ షాట్‌.. బంతి గట్టిగా తగిలి నొప్పితో విలవిల్లాడిన అంపైర్‌

ఈనేపథ్యంలో బ్యాటర్లు బలంగా బాదే షాట్ల వల్ల కొన్ని సార్లు బౌలర్లు, ఫీల్డర్లు తీవ్రంగా గాయపడుతున్నారు. మరికొన్ని సార్లు ఫీల్డ్ అంపైర్లు కూడా గాయపడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన ఆరో టీ20 మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న అలీమ్ దార్ ఇలాగే గాయ‌ప‌డ్డాడు.

Pak vs Eng: పాక్‌ బ్యాటర్‌ పవర్‌ఫుల్‌ షాట్‌.. బంతి గట్టిగా తగిలి నొప్పితో విలవిల్లాడిన అంపైర్‌
Pak Vs Eng
Follow us
Basha Shek

|

Updated on: Oct 01, 2022 | 12:43 PM

ఎప్పుడైతే టీ20 క్రికెట్‌ ఫార్మాట్‌ ప్రారంభమైందో బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యర్థి.. బౌలర్‌ ఎవరైనా సరే వీలైనంత వేగంగా పరుగులు సాధించడమే బరిలోకి దిగుతున్నారు. ఈనేపథ్యంలో బ్యాటర్లు బలంగా బాదే షాట్ల వల్ల కొన్ని సార్లు బౌలర్లు, ఫీల్డర్లు తీవ్రంగా గాయపడుతున్నారు. మరికొన్ని సార్లు ఫీల్డ్ అంపైర్లు కూడా గాయపడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన ఆరో టీ20 మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న అలీమ్ దార్ ఇలాగే గాయ‌ప‌డ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఈ ఘ‌ట‌న ఇన్నింగ్స్ ఆరో ఓవ‌ర్‌లో చోటు చేసుకుంది. రిచ‌ర్డ్ గ్లీస‌న్ వేసిన ఆ ఓవ‌ర్‌లో బ్యాట‌ర్ హైద‌ర్ ఫుల్ షాట్ ఆడాడు. బంతి త‌న‌వైపు వ‌స్తున్నట్లు గ‌మ‌నించిన అంపైర్ అలీమ్ దార్‌ దాని నుంచి త‌ప్పించుకునేందుకు తెగ ట్రై చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ బాల్ గట్టిగా ఆయనకు తగిలింది. దీంతో కొద్ది సేపు నొప్పితో బాధపడిపోయాడు అంపైర్‌ దార్‌. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఏడు వన్డేల సిరీస్‌ను 3-3తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్ 6 వికెట్లకు 169 ర‌న్స్ చేయ‌గా, ఇంగ్లండ్‌ 14.3 ఓవర్లలోనే సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఫిల్ సాల్ట్ 41 బంతుల్లో 88 ర‌న్స్ చేశాడు. హేల్స్ 27, మ‌ల‌న్ 26, డ‌క్కెట్‌26 పరుగులతో రాణించారు. కాగా సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి టీ20 మ్యాచ్‌ రేపు జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే