IND vs AUS: విధ్వంసానికి మారుపేరు.. క్రీజులోకి వస్తేనే భారత బౌలర్లకు వణుకు మొదలు..
Travis Head Records Against India: ట్రావిస్ హెడ్ పేరు వింటనే టీమిండియా బౌలర్లు భయపడుతున్నారు. ఈ వ్యక్తి క్రీజులోకి వచ్చాడంటే ఎలాంటి విధ్వంసం చేస్తాడోనని అంతా వణికిపోతున్నారు. ఈ క్రమంలో మరోసారి అడిలైడ్‌లో రెచ్చిపోయిన హెడ్.. సెంచరీతో భారత జట్టుపై ఆడడం ఎంత ఇష్టమో చూపించాడు.
Travis Head Records Against India: పెర్త్ టెస్టు మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్ లో ఓటమి అంచున నిలిచింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు రెండో రోజు ఓడిపోవడం తప్పదని తెలుస్తోంది. అడిలైడ్ టెస్టులో భారత జట్టు ఈ స్థానానికి చేరుకోవడానికి అతిపెద్ద కారణం ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టీమిండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ట్రావిస్ హెడ్ కేవలం 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 140 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా, ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించింది. దీంతో టెస్ట్ మ్యాచ్‌ను అనుకూలంగా మార్చుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్‌కు అతిపెద్ద ముప్పుగా మారిన ట్రావిస్ హెడ్, ఈ టెస్టు మ్యాచ్‌లోనే కాదు, మెన్ ఇన్ బ్లూకు ఎప్పుడూ అతిపెద్ద తలనొప్పిగా నిరూపించుకున్నాడు. అసలు భారత క్రికెట్ జట్టుకు ట్రావిస్ హెడ్ ఎందుకు అతిపెద్ద డేంజరస్‌గా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ నేడు భారత జట్టుకు అతిపెద్ద సంక్షోభంగా మారాడు. అతను ODI ప్రపంచ కప్ 2023 చివరి మ్యాచ్ నుంచి ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 వరకు భారత్‌పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు టీమిండియాపై ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
ట్రావిస్ హెడ్ భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాడు. ఈ కొన్ని గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కంగారూ బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడితే, అతను రెడ్ బాల్ ఫార్మాట్‌లో టీమ్ ఇండియాపై సెంచరీ సాధించగా, వైట్ బాల్‌లో కూడా అతను భారత్‌పై సెంచరీ చేశాడు. ఇది కాకుండా, అతను భారత జట్టుపై వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీ సాధించాడు. WTC ఫైనల్లో కూడా సెంచరీ సాధించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియాపై ఫిఫ్టీ కూడా సాధించాడు. అలా ఇప్పుడు బీజీటీలోనూ సెంచరీ సాధించాడు.
2023 నుంచి ఈ భయంకరమైన బ్యాట్స్‌మెన్ ప్రదర్శన గురించి మాట్లాడితే, అతను మూడు ఫార్మాట్‌లలోని 19 ఇన్నింగ్స్‌లలో 62 సగటుతో 1052 పరుగులు చేశాడు. ఇందులో అతను 4 అర్ధ సెంచరీలతో పాటు 3 సెంచరీలు సాధించి విజయం సాధించాడు. 2023 నుంచి ఇప్పటి వరకు, హెడ్ 54 ఇన్నింగ్స్‌లలో అన్ని ఇతర జట్లపై 36.6 సగటుతో 1875 పరుగులు చేశాడు. ఇందులో అతను 10 అర్ధ సెంచరీలు కాకుండా 3 సెంచరీలు సాధించాడు. భారత జట్టుపై ట్రెవిడ్ హెడ్ ఇంతలా ఎందుకు రెచ్చిపోయి ఆడుతున్నాడో ఈ రికార్డులను బట్టి స్పష్టమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..