IND vs AUS 3rd T20 : అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద సిక్సర్.. టిమ్ డేవిడ్ విధ్వంసం
భారత్, ఆస్ట్రేలియా మధ్య హోబర్ట్‌లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ తన పవర్ హిట్టింగ్‌తో ప్రేక్షకులను, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ కేవలం 23 బంతుల్లోనే మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అతి పొడవైన సిక్స్ రికార్డును నెలకొల్పాడు.

IND vs AUS 3rd T20 : భారత్, ఆస్ట్రేలియా మధ్య హోబర్ట్‌లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్ తన పవర్ హిట్టింగ్‌తో ప్రేక్షకులను, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ కేవలం 23 బంతుల్లోనే మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అతి పొడవైన సిక్స్ రికార్డును నెలకొల్పాడు. అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో టిమ్ డేవిడ్ కొట్టిన ఆ సిక్స్ ఏకంగా 129 మీటర్ల దూరం ప్రయాణించింది. గతంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ నెలకొల్పిన 124 మీటర్ల రికార్డును కూడా టిమ్ డేవిడ్ బద్దలు కొట్టాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య హోబర్ట్‌లో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఒక అసాధారణమైన రికార్డును సృష్టించాడు. టిమ్ డేవిడ్ కొట్టిన సిక్స్ ఏకంగా 129 మీటర్ల దూరం ప్రయాణించిందని నమోదు అయింది. ఇది అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అతి పొడవైన సిక్స్‌గా రికార్డు సృష్టించింది. ఇటీవల మెల్‌బోర్న్ టీ20లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ 124 మీటర్ల సిక్స్ కొట్టి రికార్డు సృష్టించారు. ఇప్పుడు టిమ్ డేవిడ్ ఆ రికార్డును అధిగమించడం విశేషం.
Tim David hammered a 129M six. 🤯 pic.twitter.com/KFYF2DaTAr
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2025
ఈ రికార్డు సిక్స్‌ను టిమ్ డేవిడ్ భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చేస్తుండగా అక్షర్ పటేల్ అతడికి ఫుల్ లెంగ్త్ బంతిని వేశాడు. టిమ్ డేవిడ్ ఆ బంతిని బౌలర్ తల మీదుగా కొట్టగా, అది నేరుగా హోబర్ట్ స్టేడియం పైకప్పుపైకి వెళ్లింది. ఆ ఓవర్‌లో టిమ్ డేవిడ్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఏకంగా రెండు సిక్సర్లు కొట్టడం గమనార్హం.
టిమ్ డేవిడ్ కేవలం సిక్స్‌లకే పరిమితం కాలేదు, ఈ మ్యాచ్‌లో తన పవర్ హిట్టింగ్‌తో ఆస్ట్రేలియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టిమ్ డేవిడ్ కేవలం 23 బంతుల్లోనే మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ (50) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో శివమ్ దూబే వేసిన బంతులను కూడా ధీటుగా ఎదుర్కొన్న టిమ్ డేవిడ్, ఆ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి తన దూకుడును కొనసాగించాడు. చివరగా శివందూబే బౌలింగులో వరుసగా రెండు సిక్సులు కొట్టి మూడో సిక్స్ కు ప్రయత్నించే క్రమంలో తిలక్ వర్మ చేతికి చిక్కాడు. మొత్తంగా 37బంతుల్లో 74పరుగులు చేసి డేవిడ్ అవుటయ్యాడు.




