Arshdeep Singh :ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి తప్పించిన కోచ్‌కు బంతితోనే రిప్లై..6 బంతుల్లో 2 వికెట్లు తీసిన యంగ్ పేసర్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, మూడో మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, సెలక్టర్లకు, కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఘాటుగా సమాధానం చెప్పాడు.

Arshdeep Singh : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, మూడో మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, సెలక్టర్లకు, కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఘాటుగా సమాధానం చెప్పాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో అతడికి అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి, సిరీస్‌లో వెనుకబడిన తర్వాత, మూడో మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అర్ష్‌దీప్, తను వేసిన మొదటి 6 బంతుల్లోనే 2 కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లను తక్కువ స్కోరుకే అవుట్ చేసిన అర్ష్‌దీప్, తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మొదటి రెండు టీ20 మ్యాచ్‌లకు ప్లేయింగ్ 11 నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్‌కు బదులుగా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌లలో ఒకరైన అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు మండిపడ్డారు. మొదటి రెండు మ్యాచ్‌లలో కోచ్, కెప్టెన్ వ్యూహం అనుకున్నంతగా ఫలించకపోవడంతో మూడో మ్యాచ్‌లో మార్పులు చేయక తప్పలేదు.
A great start for #TeamIndia as Arshdeep Singh strikes in the very first over to dismiss Travis Head.
Live – https://t.co/7lGDijSY0L #TeamIndia #AUSvIND #3rdT20I pic.twitter.com/PC7QHzxTN1
— BCCI (@BCCI) November 2, 2025
సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా, మూడో మ్యాచ్‌లో సిరీస్‌ను కాపాడుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. వికెట్ కీపర్ సంజు శాంసన్, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మరియు స్పిన్నర్ కులదీప్ యాదవ్లను ప్లేయింగ్ 11 నుంచి తప్పించారు. వారి స్థానంలో వికెట్ కీపర్ జితేశ్ శర్మ, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్లను తుది జట్టులోకి తీసుకున్నారు.
అవకాశం దక్కిన వెంటనే అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్‌తో విమర్శకులకు దీటైన జవాబిచ్చాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అర్ష్‌దీప్ వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికి, ప్రమాదకరమైన ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్‌ను తీసి టీమిండియాకు తొలి బ్రేక్ ఇచ్చాడు. తన రెండో ఓవర్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్, మూడో బంతికే మరో కీలకమైన బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్‌ను కేవలం 1 పరుగుకే అవుట్ చేయించాడు. అక్షర్ పటేల్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి ఇంగ్లిస్ పెవిలియన్ చేరాడు. ఈ విధంగా, తను వేసిన మొదటి 6 బంతుల్లోనే 2 కీలక వికెట్లు పడగొట్టి, మ్యాచ్‌పై భారత్‌కు పట్టు దొరికేలా చేయడంలో అర్ష్‌దీప్ కీలక పాత్ర పోషించాడు.




