Tilak Varma: వర్త్ వర్మ వర్త్.. ఐసీసీ ర్యాంకుల్లో అదరగొట్టిన తిలక్.. ఏకంగా 70 స్థానాలు ఎగబాకి..
ఐసీసీ టీ20 బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది, ఈ టాప్-10 జాబితాలో టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న టీ20 సిరీస్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఈసారి 70 స్థానాలు ఎగబాకడం విశేషం.

ఐసీసీ టీ20 బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితా విడుదలైంది. ఈసారి కూడా ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో అదరగొట్టిన టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఏకంగా 70 స్థానాలు ఎగబాకి 2వ స్థానంలో నిలవడం విశేషం. నవంబర్ 10, 2024న ICC T20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో 72వ ర్యాంక్‌లో ఉన్న తిలక్ వర్మ ఇప్పుడు అద్భుత ప్రదర్శనతో 2వ స్థానానికి చేరుకోగలిగాడు. ప్రస్తుతం 832 పాయింట్లతో ఉన్న తిలక్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తే ట్రావిస్ హెడ్ (855)ను అధిగమించవచ్చు ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ (782) మూడో స్థానంలో ఉండగా, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉన్నాడు. సూర్య ఖాతాలో 763 పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ (749), పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం (712), శ్రీలంకకు చెందిన పాతుమ్ నిసంక (707), పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ (704) వరుసగా 5, 6, 7, 8వ స్థానాల్లో నిలిచారు.
టీమిండియా ఎడమచేతి వాటం బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ టీ 20 ర్యాంకుల్లో 9వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమైన జైస్వాల్ ఖాతాలో 685 పాయింట్లు ఉన్నాయి. శ్రీలంకకు చెందిన కుశాల్ పెరీరా (675) పదో స్థానంలో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున వరుసగా 5 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. తిలక్ వర్మ 107*, 120*, 19*, 72*, 18 పరుగులతో ఈ ఘనత సాధించాడు. దీంతో టీమిండియా తరఫున వరుసగా 5 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఉత్కంఠ రేపుతోంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్ 2-1తో సమమైంది. జనవరి 31న భారత్-ఇంగ్లండ్ మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
మూడు నెలల్లోనే..
Tilak Varma in the ICC Men’s T20I batters rankings:
10th November 2024 – 72nd
29th January 2025 – 2nd
It all happened in the span of less than just 3 months, 70 spots. 🤯🥶🔥🔥
The rise of a star! 🇮🇳🌟#TilakVarma #INDvENG pic.twitter.com/XwCCKeJIAA
— Saabir Zafar (@Saabir_Saabu01) January 29, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..