Team India: జైలుకెళ్లి వచ్చి కెరీర్ నాశనం చేసుకున్న ముగ్గురు టీమిండియా క్రికెటర్లు.. లిస్టులో ధోని భక్తుడు
భారత క్రికెట్ చరిత్రలో ముగ్గురు స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాలతో అరెస్టు అయ్యి జైలు పాలయ్యారు. శ్రీశాంత్ 2013లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో, అమిత్ మిశ్రా 2015లో ఒక మహిళ ఫిర్యాదు కారణంగా, సురేష్ రైనా 2020లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరంతా కొద్దికాలంలోనే బెయిల్‌పై విడుదలయ్యారు.

భారత క్రికెట్ చరిత్రలో కొందరు ప్రముఖ ఆటగాళ్లు వివిధ సందర్భాలలో చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు భారత క్రికెటర్లు ఎవరని చూస్తే.. ముందుగా శ్రీశాంత్. 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అరెస్ట్ అయిన తర్వాత, శ్రీశాంత్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. అయితే, ఈ సంఘటన శ్రీశాంత్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.
రెండో ఆటగాడు, అమిత్ మిశ్రా. 2015లో ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అమిత్ మిశ్రాను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కూడా వార్తల్లో నిలిచింది. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత, అమిత్ మిశ్రా కేవలం ఒక రోజులోనే బెయిల్ మీద విడుదలయ్యారు. మూడో ఆటగాడు సురేష్ రైనా. 2020లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో, ముంబైలోని ఒక హోటల్‌లో జరిగిన పార్టీకి సురేష్ రైనా హాజరయ్యాడు. ఇది కోవిడ్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సురేష్ రైనాను అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే, అంటే కేవలం ఒక గంటలోపే అతడు బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ ముగ్గురు క్రికెటర్లు విభిన్న కారణాలతో పోలీసుల అదుపులోకి తీసుకున్నా, త్వరగానే విడుదలయ్యారు.
ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
