AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా టీ20 కెప్టెన్ రేసులో ‘ఆ నలుగురు’.. ఆ ప్లేయర్‌కే జైషా అండదండలు

టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత..టీమిండియా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే శుభ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే అతను కేవలం ఈ సిరీస్‌కు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. మరి ఆ తర్వాత.. టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా ఎవరుంటారనే అంశంపై ఆసక్తిగా నెలకొంది

Team India: టీమిండియా టీ20 కెప్టెన్ రేసులో 'ఆ నలుగురు'.. ఆ ప్లేయర్‌కే జైషా అండదండలు
Team India
Basha Shek
|

Updated on: Jul 01, 2024 | 7:05 PM

Share

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు . తద్వారా రాబోయే టీ20 సిరీస్‌లో భారత జట్టుకు కొత్త ప్లేయర్ సారథ్యం వహించనున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత..టీమిండియా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే శుభ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే అతను కేవలం ఈ సిరీస్‌కు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. మరి ఆ తర్వాత.. టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా ఎవరుంటారనే అంశంపై ఆసక్తిగా నెలకొంది. కాగా టీ20 వరల్డ్‌ కప్‌ సాధించిన జట్టు నుంచి ఓ నలుగురు ఆటగాళ్లకు భారత టీ20 కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందు వరుసలో ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకు ముందు టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్‌కు ముందు తప్పుకున్నాడు. రోహిత్ శర్మకు కెప్టెన్‌గా పట్టం కట్టారు. ఇప్పుడు T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత T20I క్రికెట్‌కు హిట్‌మాన్ వీడ్కోలు పలికాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా కనిపించిన హార్దిక్ పాండ్యా రానున్న సిరీస్‌లో కెప్టెన్‌గా మారడం దాదాపు ఖాయం. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ధృవీకరించినట్లు సమాచారం.

‘భారత జట్టు కెప్టెన్‌ని సెలక్టర్లు నిర్ణయిస్తారు. వారితో చర్చించిన తర్వాత ప్రకటిస్తాం. మీరు హార్దిక్ గురించి అడిగారు. అతని ఫామ్ గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే మేం, సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచాం. అందుకే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేశాం. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి తన సత్తాను నిరూపించుకున్నాడు’ అని జైషా తెలిపారు. హార్దిక్ పాండ్యా ఆటతీరుపై బీసీసీఐ సెక్రటరీ ప్రశంసలు కురిపించడంతో రోహిత్ శర్మ వారసుడిగా పాండ్యా ఎంపిక కావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కెప్టెన్ రేసులో వీరు కూడా..

హార్దిక్ పాండ్యా కాకుండా టీమిండియా టీ20 కెప్టెన్‌ రేసులో మరో ముగ్గురు ఉన్నారు. వారే జస్ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌. సీనియర్ కావడం, గతంలో టీమిండియాకు సారథ్యం వహించిన అనుభవం ఉండడం బుమ్రాకు ప్లస్ పాయింట్స్. పైగా కెప్టెన్‌ కావాలని బుమ్రా కూడా కోరుకుంటున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరూ కాకుండా సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్ లకు గంభీర్ తో మంచి అనుబంధం ఉంది. పైగా గౌతీ యంగ్ టీమ్ ను కోరుకుంటున్నాడు. కాబట్టి పంత్ ను కెప్టెన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..