IPL: ధోని, కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ టీమిండియా ప్లేయర్‌కే అత్యధిక శాలరీ.! ఎవరంటే..
ఈసారి ఐపీఎల్ మాంచి కిక్ ఇస్తోంది. మునపటి సీజన్లతో పోలిస్తే.. ఈ 17వ ఎడిషన్‌లో రెండుసార్లు అత్యధిక టీం స్కోర్లు నమోదు కాగా.. సీనియర్ల కంటే యంగ్ బ్యాటర్లు చాలామంది ఇంప్రెస్ చేస్తున్నారు. సరే.. ఇదంతా పక్కనపెడితే.. ఈ ఐపీఎల్‌లో స్టార్ ఆటగాళ్లకు శాలరీ ఎంత వస్తోందో మీకు తెలుసా.?
ఈసారి ఐపీఎల్ మాంచి కిక్ ఇస్తోంది. మునపటి సీజన్లతో పోలిస్తే.. ఈ 17వ ఎడిషన్‌లో రెండుసార్లు అత్యధిక టీం స్కోర్లు నమోదు కాగా.. సీనియర్ల కంటే యంగ్ బ్యాటర్లు చాలామంది ఇంప్రెస్ చేస్తున్నారు. సరే.. ఇదంతా పక్కనపెడితే.. ఈ ఐపీఎల్‌లో స్టార్ ఆటగాళ్లకు శాలరీ ఎంత వస్తోందో మీకు తెలుసా.? టీమిండియా క్రికెటర్లలో టాప్ 5 హయ్యెస్ట్ జీతాలు అందుకుంటున్నవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ లిస్టులో ధోని, కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారనుకుంటే.. మీరు పొరబడినట్టే. ఐపీఎల్ 2024లో టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్అత్యధిక జీతం అందుకుంటున్నాడు. ధోనీ కంటే రాహుల్ 42 శాతం ఎక్కువ సంపాదన అర్జిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 17 కోట్లు రాహుల్‌కు అందిస్తోంది. అటు రోహిత్ శర్మ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు రూ. 16 కోట్లు హిట్‌మ్యాన్‌కు ఇస్తోంది.
ఇక రవీంద్ర జడేజాకు చెన్నై సూపర్ కింగ్స్ రూ. 16 కోట్ల జీతం ముట్టజెప్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల కాంట్రాక్టును రిషబ్ పంత్‌తో కుదుర్చుకుంది. అలాగే 26 ఏళ్ల ఇషాన్ కిషన్.. ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ.. 2022 నుంచి ప్రతీ సీజన్‌లోనూ రూ. 15.25 కోట్లు సంపాదిస్తున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ప్రస్తుత సీజన్‌లో రూ. 15 కోట్లు అర్జిస్తున్నాడు. టీమిండియా రన్ మిషన్ తర్వాత హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ ఉండగా.. చివరిగా ధోని రూ. 12 కోట్లు సంపాదిస్తూ ఈ లిస్టులో 11వ స్థానంలో నిలిచాడు.