WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇంకెన్ని మ్యాచ్‌లు గెలవాలో తెలుసా? పూర్తి వివరాలు

|

Sep 22, 2024 | 9:36 PM

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ విజయంతో ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌లో ఫైనల్‌కి అర్హత సాధించాలంటే టీమ్ ఇండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి? ఏయే జట్లతో ఎన్నెన్ని మ్యాచులు ఉన్నాయో తెలుసుకుందాం రండి.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇంకెన్ని మ్యాచ్‌లు గెలవాలో తెలుసా? పూర్తి వివరాలు
Team India
Follow us on

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ విజయంతో ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌లో ఫైనల్‌కి అర్హత సాధించాలంటే టీమ్ ఇండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి? ఏయే జట్లతో ఎన్నెన్ని మ్యాచులు ఉన్నాయో తెలుసుకుందాం రండి. 2023-25 ​​ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత, టీమ్ ఇండియా 86 రేటింగ్ పాయింట్లు సాధించగా, జట్టు విజయాల శాతం 71.67గా ఉంది. WTC మూడో ఎడిషన్‌లో, టీమిండియా ఇప్పటివరకు వెస్టిండీస్‌ను 1-0తో మరియు ఇంగ్లాండ్‌ను 4-1 తేడాతో ఓడించింది. ఇప్పుడు 2 టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 1-0 తేడాతో ఓడించి ఆధిక్యంలో నిలిచింది. టీం ఇండియా ఇంకా బంగ్లాదేశ్‌తో 1, న్యూజిలాండ్‌తో 3, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను టీమిండియా ఇప్పటి వరకు 1-1తో సమం చేసింది. భారత్‌ ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.

 

ఇవి కూడా చదవండి

ICC నివేదిక ప్రకారం, WTC ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే టీమ్ ఇండియా రాబోయే 9 మ్యాచ్‌లలో కనీసం 6 గెలవాలి. ఇందులో బంగ్లాదేశ్‌తో 1 టెస్టు మ్యాచ్‌ను, న్యూజిలాండ్‌తో 3 టెస్టు మ్యాచ్‌లను భారత్ తన సొంత మైదానంలో ఆడనుంది. ఆ తర్వాత ఆ జట్టు విదేశీ గడ్డపై అంటే ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఫైనల్ చేరాలంటే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ టాప్-2లో ఉండాలి. తద్వారా 5 మ్యాచ్‌లు గెలిచినా, 1 మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు ఫైనల్‌కు టిక్కెట్‌ దక్కుతుంది.

మిగతా జట్ల గురించి చెప్పాలంటే… డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న ఆస్ట్రేలియా పాయింట్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌లు గెలవాలి లేదా 3 మ్యాచ్‌లు గెలిచి 1 మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు మిగిలిన 8 మ్యాచ్‌ల్లో కనీసం 6 మ్యాచ్‌లు గెలవాలి లేదా 5 మ్యాచ్‌లు గెలిచి 1 మ్యాచ్‌ని డ్రా చేసుకోవాలి.

బంగ్లాపై గెలిచాక అశ్విన్..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..