Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాలో అదరగొట్టిన తెలుగబ్బాయ్.. కట్‌చేస్తే.. బీసీసీఐ నుంచి కోటి రూపాయల రివార్డ్?

Nitish Kumar Reddy: అడిలైడ్ టెస్టులో ఇతర భారత బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన పేలవంగా ఉన్నప్పటికీ, నితీష్ రెడ్డి అత్యధికంగా 42 పరుగులు చేసి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇప్పటివరకు తన మూడు టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. త్వరలో ఈ ఆటగాడు బీసీసీఐ నుంచి రూ. 1 కోటి రివార్డు పొందే అవకాశం ఉంది.

Nitish Kumar Reddy: ఆస్ట్రేలియాలో అదరగొట్టిన తెలుగబ్బాయ్.. కట్‌చేస్తే.. బీసీసీఐ నుంచి కోటి రూపాయల రివార్డ్?
Nitish Kumar Reddy
Follow us
Venkata Chari

|

Updated on: Dec 07, 2024 | 1:45 PM

Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ తక్కువ సమయంలో అతను ఎంతో పేరు సంపాదించాడు. కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఆటగాడు లాంగ్ రేస్ హార్స్ అని నిరూపించుకున్నాడు. పెర్త్ టెస్ట్ తర్వాత, అతను అడిలైడ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్‌తో ముఖ్యమైన సహకారం అందించాడు. ఇదిలా ఉంటే, నితీష్ కుమార్ రెడ్డితోపాటు అతని అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ రానుంది. అతను త్వరలో బిసిసిఐ నుంచి భారీ రివార్డ్ పొందబోతున్నాడు. ఈ బహుమతి కోటి రూపాయల విలువైన కాంట్రాక్ట్ అవుతుంది. నితీష్ కుమార్ రెడ్డికి బిసిసిఐ కోటి రూపాయల కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తుందో ఓసారి చూద్దాం..

నితీష్ కుమార్ రెడ్డిపై కోటి రూపాయల వర్షం..

బీసీసీఐ నిబంధన వల్ల నితీష్ కుమార్ రెడ్డికి కోటి రూపాయలు అందుతాయి. రెడ్డి ప్రస్తుతం రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మూడో టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం లభిస్తే, అతను బీసీసీఐ కాంట్రాక్ట్‌కు అర్హత పొందుతాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు మూడు టెస్టులు ఆడితే సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హత పొందుతాడు. అంటే, రెడ్డికి గ్రేడ్ సి కాంట్రాక్ట్ దక్కడం ఖాయం. నితీష్ కుమార్ రెడ్డికి గ్రేడ్ సి కాంట్రాక్ట్ లభిస్తే, ఈ ఆటగాడు ఏటా కోటి రూపాయలు అందుకుంటాడు. ఇది కాకుండా మ్యాచ్‌లు ఆడటానికి విడిగా డబ్బు పొందుతాడు. టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షల మ్యాచ్ ఫీజును బీసీసీఐ చెల్లిస్తుంది.

నితీష్ కుమార్ రెడ్డి మూడో టెస్టు ఆడడం ఖాయం..

ఆస్ట్రేలియా టూర్‌లో మూడో టెస్టు ఆడేందుకు నితీష్ కుమార్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా టీమిండియా తదుపరి టెస్టు ఆడాల్సి ఉంది. ఈ టెస్ట్‌ బరిలోకి దిగిన వెంటనే ఈ తెలుగు ప్లేయర్ కు సి గ్రేడ్ సెంట్రల్ కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అవుతుంది. నితీష్ రెడ్డి ఇప్పటి వరకు అద్భుతంగా రాణిస్తున్నాడు. పెర్త్‌లో నితీష్ 41, 38 నాటౌట్‌లతో ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు అతను అడిలైడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో అతని అత్యుత్తమ స్కోరుగా కూడా మారింది. వచ్చే మ్యాచ్‌ల్లో నితీశ్‌రెడ్డి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేస్తే.. ఈ ఆటగాడు మరింత భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..