AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 బంతుల్లో 2 సార్లు లైఫ్ ఇచ్చారు.. కట్‌చేస్తే.. తుఫాన్ సెంచరీతో టీమిండియాకు మరోసారి తలనొప్పిలా మారాడు

Travis Head Century: గత ఏడాదిన్నరగా ఎన్నో మ్యాచ్ ల్లో టీమిండియాకు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్.. మరోసారి తన అటాకింగ్ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను కష్టాల నుంచి గట్టెక్కించి, అడిలైడ్‌లో భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నాడు.

7 బంతుల్లో 2 సార్లు లైఫ్ ఇచ్చారు.. కట్‌చేస్తే.. తుఫాన్ సెంచరీతో టీమిండియాకు మరోసారి తలనొప్పిలా మారాడు
Travis Head Century
Venkata Chari
|

Updated on: Dec 07, 2024 | 1:21 PM

Share

Travis Head Century: టీమ్ ఇండియాకు ట్రావిస్ హెడ్ అనే తలనొప్పి తగ్గడం లేదు. గత ఏడాదిన్నరగా భారత్‌తో జరిగిన ఎన్నో భారీ మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్.. మళ్లీ తన మ్యాజిక్ చూపించాడు. అడిలైడ్‌లో జరుగుతున్న డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ట్రావిస్ హెడ్ తుఫాన్ బ్యాటింగ్ చేసి భారత్‌పై మరో సెంచరీ సాధించాడు. దీంతో ఈ డే అంట్ నైట్ టెస్ట్‌లో భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా ముందుకు సాగుతోంది.

పింక్ బాల్ మ్యాచ్ రెండవ రోజు, ట్రావిస్ హెడ్ తన సొంత మైదానం అడిలైడ్ ఓవల్‌లో మొదటి సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 3 వికెట్ల పతనం తర్వాత ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ హెడ్ క్రీజులోకి వచ్చాడు. ఈ సమయంలో జట్టు స్కోరు 103 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్‌ను ప్రదర్శిస్తున్నాడు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడుతూ, మార్నస్ లాబుస్‌చాగ్నేతో కలిసి హెడ్ జట్టుపై నియంత్రణ సాధించి భారత్‌ను స్కోరుకు చేరువ చేశాడు. ఈ సమయంలో, లాబుస్చాగ్నే ఔట్ అయినప్పటికీ హెడ్ మొదటి సెషన్‌లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ కెరీర్‌లో 8వ సెంచరీ సాధించాడు. హోం గ్రౌండ్‌లో హెడ్‌కి ఇది 7వ సెంచరీ కావడం గమనార్హం.

250 దాటిన ఆస్ట్రేలియా స్కోర్..

71వ ఓవర్లో ఆస్ట్రేలియా 250 పరుగుల మార్క్‌ను దాటింది. హర్షిత్ రాణా వేసిన ఓవర్ తొలి, రెండో బంతుల్లో ఫోర్ బాదిన ట్రావిస్ హెడ్ స్కోరు 250 దాటించాడు. ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 274 పరుగులు చేసింది. హెడ్ 114, అలెక్స్ కారీ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆధిక్యం 100 పరుగులకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..