Under-19 World Cup 2022 : ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ గెలుచుకున్న యంగ్ ఇండియా
అండర్-19 ప్రపంచకప్ 2022 విజేతగా నిలిచింది టీమిండియా. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 190 పరుగుల లక్ష్యాన్ని ఇండియా మరో 2 బంతులు మిగిలిఉండగా చేధించింది.
Under-19 World Cup 2022 : అండర్-19 ప్రపంచకప్ 2022 విజేతగా నిలిచింది టీమిండియా. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 190 పరుగుల లక్ష్యాన్ని ఇండియా మరో 2 బంతులు మిగిలిఉండగా చేధించింది. అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోవడం ఇది ఐదోసారి. భారత్ బ్యాటింగ్‌లో నిషాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ సరిగ్గా 50 పరుగులు చేసి ఔటయ్యాడు. రాజ్ బవా 35 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ సేల్స్, బోయ్‌డెన్, అస్పిన్‌వాల్ తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు టీమిండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. బ్యాటర్ జేమ్స్ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన ఆటతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. టెయిలెండర్ జేమ్స్ సేల్స్(31)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రూ.. 5 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక అండర్ -19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్లు దుమ్మురేపారు. కరేబియన్ గడ్డపై ఆల్ రౌండ్ షో తో అదరగొట్టారు యంగ్ భారత్. అండర్ 19 ప్రపంచకప్‌లో ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది ఇండియా. కెప్టెన్ యశ్ ధూల్ కెప్టెన్సీలో అదుర్స్ అనేలా ఆడిన మన కుర్రాళ్ల టీమ్ వరుసగా ఐదోసారి ఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ ఫైట్‌లో ఇంగ్లీష్ టీమ్‌తో గెలిచింది యంగ్ ఇండియా.
మరిన్ని ఇక్కడ చదవండి :