Smriti Mandana: రికార్డు సృష్టించిన స్మృతి మందాన.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం కైవసం.. బౌలింగ్ విభాగంలో ఇద్దరికి చోటు

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో ఈ ఘనత అందుకుంది. హాఫ్ సెంచరీతో స్మృతి మందాన ఈ లక్ష్యానికి చేరుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన..

Smriti Mandana: రికార్డు సృష్టించిన స్మృతి మందాన.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానం కైవసం.. బౌలింగ్ విభాగంలో ఇద్దరికి చోటు
Smriti Mandana
Follow us

|

Updated on: Sep 20, 2022 | 9:53 PM

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో ఈ ఘనత అందుకుంది. హాఫ్ సెంచరీతో స్మృతి మందాన ఈ లక్ష్యానికి చేరుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన మహిళల క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో స్మృతి మందాన కొనసాగుతోంది. మొదటి ప్లేస్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్‌ మూనీ కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌పై మూడు మ్యాచుల్లో 111 పరుగులు చేయడంతో మందాన రెండు ర్యాంకులను అధిగమించింది. వన్డేల్లోనూ మూడు స్థానాలు మెరుగపర్చుకొని ఏడో ర్యాంక్‌కు చేరింది. టీమ్‌ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ కౌర్ (662 పాయింట్లు) కూడా నాలుగు స్థానాలను ఎగబాకి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. వన్డే బౌలింగ్‌ జాబితాలో టాప్‌-10లో భారత్‌ నుంచి ఇద్దరు బౌలర్లు ఉన్నారు. సీనియర్‌ బౌలర్ ఝులన్‌ గోస్వామి ఐదో స్థానం, రాజేశ్వరి గైక్వాడ్ ఏడో స్థానంలో కొనసాగుతున్నారు.

కాగా.. గతంలో స్మృతి మందాన ఎనిమిదో స్థానంలో ఉంది. బౌలర్ల జాబితాలో సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి ఒక స్థానం కిందికి పడిపోయింది. ఈ ఏడాది ఆడిన 9 మ్యాచుల్లో 411 పరుగులు చేసింది 25 ఏళ్ల మంధాన. అందులో ప్రపంచకప్​లో వెస్టిండీస్​పై చేసిన ఓ సెంచరీ కూడా ఉంది. ఆస్ట్రేలియన్​ అలిస్సా హీలీ అగ్రస్థానంలో ఉన్న ఈ టాప్​ 10 బ్యాటర్ల జాబితాలో భారత్​నుంచి కేవలం స్మృతి మంధాన మాత్రమే ఉంది.