ఐపీఎల్ 2025లో తుఫాన్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. 2 ఏళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి డేంజరస్ డైనోసార్ రీఎంట్రీ?
KL Rahul May Join Bangladesh T20Is: గత కొంతకాలంగా కేఎల్ రాహుల్ ప్రదర్శన చాలా బాగుంది. ఈ కారణంగా, సెలక్షన్ కమిటీ మరోసారి అతని పేరును టీ20 జట్టుకు పరిగణించాలని యోచిస్తోంది. ఆగస్టు 26 నుంచి 31 వరకు బంగ్లాదేశ్‌తో భారత్ 3 T20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.

KL Rahul May Join Bangladesh T20Is: ఐపీఎల్ 2025 (IPL 2025) ఉత్కంఠగా మారింది. ఈ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇందులో అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ పేరు కూడా ఉంది. ప్రస్తుత సీజన్‌లో, రాహుల్ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా మారాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌పై అద్భుతమైన సెంచరీ సాధించి, 112 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీనికి ముందు కూడా కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ప్రదర్శన చూసి, సెలెక్టర్లు రాహుల్‌కు భారత టీ20 జట్టులో మరోసారి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రాహుల్ పేరును పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్ ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో భారత్ తరపున రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 2022 సంవత్సరంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ నుంచి, రాహుల్‌కు సెలెక్టర్లు పొట్టి ఫార్మాట్‌లో అవకాశం ఇవ్వలేదు. రెండున్నర సంవత్సరాల తర్వాత, అతను ఇప్పుడు తిరిగి రావచ్చు అని తెలుస్తోంది. రాహుల్ తన చివరి టీ20ఊ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో అడిలైడ్‌లో ఆడాడు. అది టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్.
బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ ఎంపికయ్యే అవకాశం..
గత కొంతకాలంగా కేఎల్ రాహుల్ ప్రదర్శన చాలా బాగుంది. ఈ కారణంగా, సెలక్షన్ కమిటీ మరోసారి అతని పేరును టీ20 జట్టుకు పరిగణించాలని యోచిస్తోంది. ఆగస్టు 26 నుంచి 31 వరకు బంగ్లాదేశ్‌తో భారత్ 3 T20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. రాహుల్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌ను పరిశీలిస్తే, అతను 72 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతను 68 ఇన్నింగ్స్‌లలో 37.75 సగటు, 139.12 స్ట్రైక్ రేట్‌తో 2265 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 2 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు కనిపించాయి.
IPL 2025లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే, అతను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. అలాగే, అన్ని స్థానాల్లో రాణించాడు. రాహుల్ 11 మ్యాచ్‌ల్లో 11 ఇన్నింగ్స్‌ల్లో 61.62 సగటుతో 493 పరుగులు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 148.04 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. ఈ కాలంలో, అతను ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








