Champions Trophy: బంగ్లాపై గెలిచాం సరే.. మరి ఈ లోపాలేంటి? ఇలా అయితే తర్వాత వచ్చే టీమ్స్‌తో కష్టమే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో తమ వేటను విజయంతో మొదలుపెట్టింది టీమిండియా. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కంఫర్ట్‌బుల్ విక్టరీ సాధించింది. తొలుత బంగ్లాదేశ్‌ను 228 పరుగులకే ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదియ్ సెంచరీతో రాణించి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే జాకర్ అలీ సైతం 68 పరుగుతలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

బంగ్లాదేశ్ పై 229 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ వేగంగా ఆడాలని ముందే ఫిక్స్ బ్యాటింగ్ చేస్తున్నట్లు పిచ్ బంగ్లా బౌలర్లకు కాస్త సహకరిస్తున్నట్లు కనిపించినా ఎదురుదాడికి దిగాడు. తొలి వికెట్‌కు 9.5 ఓవర్స్‌లోనే 69 రన్స్ జోడించిన తర్వాత రోహిత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ 22, శ్రేయస్ అయ్యర్ 15, అక్షర్ పటేల్ 8 పరుగులే చేసి నిరాశపర్చిన కేఎల్ రాహుల్(41 నాటౌట్)తో కలిసి గిల్ టీమిండియా విజయతీరాలకు చేర్చాడు. తను సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో విజయం వచ్చినప్పటికీ టీమిండియలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి.
కేవలం 8 స్ట్రాంగ్ టీమ్స్ మాత్రమే ఉండే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కప్పు కొట్టాలంటే ఏ చిన్న లోపం కూడా ఉండకుండా అన్ని ఏరియాల్లో సూపర్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ట్రోఫీ మన వశం అవుతుంది. పైగా ఈ టోర్నీలో కేవలం రెండు టీమ్స్ మాత్రం చిన్న జట్లలా ఉన్నాయి. బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, అందులో ఒకటి గ్రూప్ ఏలో ఉంటే మరొకటి గ్రూప్ బీలో ఉంది. టీమిండియా గ్రూప్‌లో చిన్న టీమ్‌గా భావిస్తున్న బంగ్లాదేశ్‌పై కూడా వన్ సైడెడ్‌గా గెలవలేదు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియాలో కనిపిస్తున్న ఆ లోపాలేంటో చూద్దాం.. ముందుగా బౌలింగ్ విషయానికి వస్తే.. పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. షమీ, రానా బాగానే రాణించారు.
కానీ, క్వాలిటీ స్పిన్నర్‌గా ఉన్న కుల్దీప్ యాదవ్ మాత్రం ప్రభావం చూపలేదు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసిన 43 పరుగులు ఇచ్చి ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అలాగే 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 228 పరుగులు చేసి దాదాపు 50 ఓవర్లు(రెండు బంతులు తక్కువ) ఆడేసిందంటే ఒకరకంగా మన బౌలర్లు కాస్త పట్టు విడిచినట్లే. ఇదే తప్పు పెద్ద టీమ్‌పై చేస్తే వాళ్లు 228 వద్దే ఆగిపోరు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే.. టీమిండియా ఫీల్డింగ్ స్టాండెట్స్ మెరుగ్గా ఉన్నప్పటికీ.. చాలా సింపుల్ క్యాచ్‌లను వదిలేశారు. రోహిత్ శర్మ స్లిప్‌లో, హార్ధిక్ పాండ్యా మిడ్ ఆఫ్‌లో సులువైన క్యాచ్‌లు నేలపాలు చేశారు. టీమిండియా నుంచి ఇలాంటి క్యాచ్ డ్రాప్‌లు, చెత్త ఫీల్డింగ్ ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయరు.
ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఒక బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మ వేగంగా ఆడే క్రమంలో కొన్ని ఫాల్స్ షాట్స్ ఆడుతున్నాడు. అదృష్టం బాగుండి కొన్ని సార్లు అవి క్యాచ్‌ల రూపంలో మారకున్న కొన్ని షాట్లు వికెట్‌కు కారణం అవుతున్నాయి. ఇన్ని రోహిత్ అవుట్ అయింది కూడా ఓ బ్యాడ్ షాట్‌కే. ఇక విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌లు పిచ్ కండీషన్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సింది. కోహ్లీ అంత టైమ్ తీసుకున్నప్పటికీ నిలబడలేకపోయాడు. ఒక చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు.
పిచ్ స్లోగా ఉంది కరెక్టే కానీ, స్లో పిచ్‌లపై ఆడటం మనకు కొత్తేం కాదు కదా. సో.. ఇలాంటి చిన్న చిన్న లోపాలను సరి చేసుకొని టీమిండియా ముందుకు సాగాలని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి స్మాల్ మిస్టేక్స్ బంగ్లాదేశ్‌పై కప్పిపుచ్చుకోవచ్చు కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ వాటిని క్యాష్ చేసుకొని మనపై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. అందుకే రోహిత్ సేన తప్పుల నుంచి నేర్చుకుంటూ ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని క్రికెట్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




