Champions Trophy: బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు!
దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ ఈ విజయంతో ట్రోఫీ వేటను ఘనంగా ఆరంభించింది. మరి బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించేందుకు కారణమైన ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. బౌలింగ్ ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్ లేకపోవడంతో చాలా మందికి భారత బౌలింగ్ ఎటాక్‌పై అనేక రకాల డౌన్స్ ఉన్నాయి. బుమ్రా లేడు ఎలా ఉంటుందో ఏమో అని ఈ మ్యాచ్‌కి ముందు క్రికెట్ ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు. షమీ ఉన్నా కూడా ఇంగ్లండ్‌తో సిరీస్‌తో పెద్దగా రాణించలేదు, గాయం నుంచి కోలుకొని వస్తున్నాడు.. ఆ పాత రిథమ్ కనిపించడం లేదంటూ ఆందోళన చెందారు. కానీ, అందరి భయాలను పటాపంచలు చేస్తూ షమీ ఏకంగా 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టాడు. ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్ అందించి సూపర్ స్టార్ ఇచ్చాడు.
ఇక బుమ్రా స్థానంలో టీమ్‌లోకి వచ్చిన హర్షిత్ రాణా సైతం చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను కూడా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లతో బంగ్లాను వణికించాడు. దీంతో బంగ్లా 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. హ్యాట్రిక్ తీసే ఛాన్స్ రోహిత్ కారణంగా మిస్ అయినా సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జడేజా వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. కుల్దీప్ ఒక్కడే కాస్త ఎఫెక్టీవ్‌గా కనిపించలేదు. మిగతా బౌలర్లంతా పిచ్ కండీషన్‌కు తగ్గట్లు రాణించారు. టీమిండియ అన్ని మ్యాచ్‌లు ఇక్కడే ఆడాలి కనుక మిగతా టీమ్స్‌కు తొలి మ్యాచ్‌తోనే భారత బౌలర్లు స్ట్రాంగ్ మెసేజ్ పంపారు.
2. ఓపెనర్లు 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ల రోహిత్ శర్మ, శుమ్‌మన్ గిల్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ఇద్దరు కూడా పవర్ ప్లేలో బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి చూడచక్కటి షాట్లతో అలరించారు. చిన్న టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పటీకి బంగ్లా బౌలర్లకు ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకూడదనే ధోరణిలో ఓపెనర్ల బ్యాటింగ్ సాగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పిచ్ స్లోగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడినా.. ఆరంభంలో మంచి రన్‌రేట్‌తో ఓపెనర్లు పరుగులు చేయడంతో పెద్దగా ఒత్తిడి పడలేదు. ఆరంభం నుంచే ఓపెనర్లు స్లోగా ఆడి ఉంటే పరిస్థితి కచ్చితంగా కాస్త కఠినంగా మారేది. సో ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి రోహిత్-గిల్ జోడీకి క్రెడిట్ ఇచ్చి తీరాలి.
3. శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఛేజ్ చేయాల్సిన టార్గెట్ 229దే అయినప్పటికీ కూడా టీమిండియా దాదాపు చివరి ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరంభంలో రోహిత్-గిల్ ఆడుతున్న సమయంలో మ్యాచ్‌ను త్వరగా ముగిస్తారని అనిపించింది. కానీ, తర్వాత బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం, పిచ్ స్లోగా ఉండటం, తర్వాత వచ్చిన కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ పిచ్‌ను అంచనా వేసే లోపే అవుట్ అవ్వడంతో పరిస్థితి కాస్త కంగారు పెట్టింది. కానీ, ఓపెనర్‌గా వచ్చిన గిల్ చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయి టీమిండియాకు విక్టరీ అందించాడు. అలాగే తన సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. గిల్ ఆడి ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది.
4. పిచ్ కండీషన్ ఈ మ్యాచ్‌లో పిచ్ కండీషన్ కూడా మనకు కలిసొచ్చింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ఒక వేళ తాము టాస్ గెలిచినా తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్లం అని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. అన్నట్లే ఆరంభంలోనే బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు వణికించారు. 35 పరుగులకే 5 వికెట్లు కుప్పకూల్చారు. కానీ, ఆ తర్వాత హృదయ్, జాకర్ అలీ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో 100 లోపే ఆలౌట్ అవుతుంది అనుకున్న బంగ్లాదేశ్ 228 పరుగుల పోరాటే టార్గెట్‌ను ఇచ్చింది. ఇక టీమిండియా బ్యాటింగ్‌కు దిగి ఆరంభంలోనే ఎదురుదాడికి దిగి బంగ్లా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. సో టాస్ ఓడిపోయినా.. టీమిండియాకు అంతా కలిసొచ్చింది.
5. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ కాంట్రిబ్యూషన్‌ను మర్చిపోకూడదు. అద్భుతమైన ఫీల్డ్ సెట్‌తో పాటు సరైన టైమ్‌లో బౌలింగ్ మార్పులతో బంగ్లాదేశ్‌ను ఇబ్బంది పెట్టాడు. తాను, హార్ధిక్ క్యాచ్‌లు వదిలేయడంతో బంగ్లా అంత స్కోర్ చేసింది కానీ, లేకుంటే చాలా తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయ్యేది. క్యాచ్ వదిలేసినప్పటికీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వందకు వంద మార్కులు కొట్టేశాడు.




