Team India England: ఇంగ్లండ్ విమానం ఎక్కిన టీమిండియా మెన్, ఉమెన్ జట్లు.. భార్య, కూతురితో విరాట్..
Team India Fly To England: ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా టీమిండియా మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్టు సభ్యులు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లారు. బుధవారం అర్థరాత్రి వీరు ముంబై నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్‌లో బయలుదేరారు...
Team India Fly To England: ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా టీమిండియా మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్టు సభ్యులు ఇంగ్లండ్ బయలుదేరి వెళ్లారు. బుధవారం అర్థరాత్రి వీరు ముంబై నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్‌లో బయలుదేరారు. అంతకు ముందు సభ్యులంతా రెండు వారాలుగా ముంబయిలోని ఓ హోటల్‌లో ఉన్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ పలు పటిష్ట చర్యలు తీసుకుంది. టీమ్ ఇండియా సభ్యులు ఇంగ్లండ్ బయలు దేరిన విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇదిలా ఉంటే.. మెన్స్ టీమ్ న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తోపాటు ఇంగ్లండ్ టీమ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. అటు వుమెన్స్ టీమ్ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ 20ల్లో ఇంగ్లండ్ టీమ్‌తో తలపడనుంది. జూన్ 18న డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇక ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా అక్కడ మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనుంది. ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు కెప్టెన్ కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏ టీమ్ ఒక్కో సెషన్, ఒక్కో గంట మెరుగైన ఆట ఆడుతుందో ఆ టీమ్‌దే చాంపియన్‌షిప్ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. టీమిండియాతో పాటు న్యూజిలాండ్ జట్టులకు ఇంగ్లండ్ పరిస్థితులు ఒకేలా ఉంటాయని ఈ లెక్కన రెండు జట్లు సమజ్జీవులుగానే భావించాలని చెప్పుకొచ్చాడు. ఇక ముంబయి విమానాశ్రయంలో విరాట్ తన భార్య అనుష్క, కూతురు వామికతో కలిసి మీడియాకు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
#TeamIndia pic.twitter.com/mhmyJFc0H8
— BCCI (@BCCI) June 2, 2021
Also Read: కోవిద్ పై పోరులో ఇదో కొత్త పంథా ! వ్యాక్సిన్ తీసుకుంటే బహుమతులు….తమిళనాడులో ఓ యువకుడే ఆదర్శం
KTR Son Himanshu: సీఎం కేసీఆర్ దంపతుల అద్భుత చిత్రం.. ఫిదా అయిపోయిన కల్వకుంట్ల హిమాన్షు..