- Telugu News Photo Gallery Sports photos Devon conway breaks sourav gangulys 25 year old lords record new zealand batsman
Sourav Ganguly: దాదా రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ ఆటగాడు.. 25 ఏళ్ల నాటి చరిత్రను తిరగరాసిన డేవాన్ కాన్వే
బీసీసీఐ చైర్మన్, మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీ పేరుతో చాలా రికార్డులు ఉన్నాయి. అయితే లార్డ్స్ మైదానంలో దాదా చేసిన రికార్డును తాజాగా బ్రేక్ అయ్యింది. ఎవరు చేశారంటే...
Updated on: Jun 03, 2021 | 5:03 PM

టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ 25 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. న్యూజిలాండ్ క్రికెటర్ డేవాన్ కాన్వే ఆ ఘనతను తిరగరాశాడు. లార్డ్స్ వేదికగా అరంగేట్రం చేసి దాదా అత్యధిక పరుగులు చేసింది ఇక్కడే.

దాదా 1996లో టీమిండియా తరఫున లార్డ్స్‌లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చితక బాదేస్తూ 131 పరుగులు సాధించాడు.

ఇప్పటి వరకు లార్డ్స్‌లో అరంగేట్రంలో అత్యధిక పరుగుల ఘనత గంగూలీ పేరిటే ఉండేది. తాజాగా దానిని కాన్వే బద్దలు కొట్టాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకు ముందు 1893లో హ్యారీ గ్రాహమ్ (107 ఆసీస్), 1969లో జాన్ హ్యాంప్‌షైర్ (107, ఇంగ్లాండ్), 2004లో ఆండ్రూస్ట్రాస్ (112, ఇంగ్లాండ్), మ్యాట్ ప్రైయర్ (112 ఇంగ్లాండ్) మాత్రమే లార్డ్స్‌లో అరంగేట్రంలో సెంచరీతో బ్రేక్ కావడం గమనార్హం.

ప్రస్తుతం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మొదటి టెస్టు జరిగింది. తొలిరోజు కివీస్ 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే 56.66 స్ట్రైక్‌రేట్‌తో 136 / 240 16 ఫోర్లు సెంచరీతో చెలరేగాడు.




