అన్‌లక్కీ ప్లేయర్ ఔట్.. హైదరాబాదీ ఇన్.. ఆసియా కప్‌నకు టీమిండియా ఇదే.. దాయాదుల పోరు ఎప్పుడంటే.?
శ్రీలంకకు వెళ్లే ఆటగాళ్లు ఎవరు.? సరిగ్గా 13 రోజుల తర్వాత పాకిస్థాన్‌తో పోటీపడే జట్టులో ఎవరుంటారు.? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికేశాయి. ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగుతుంది.

గత కొన్నిరోజులుగా క్రికెట్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆసియా కప్‌లో ఏయే ప్లేయర్స్ జట్టులో భాగం కానున్నారు.! శ్రీలంకకు వెళ్లే ఆటగాళ్లు ఎవరు.? సరిగ్గా 13 రోజుల తర్వాత పాకిస్థాన్‌తో పోటీపడే జట్టులో ఎవరుంటారు.? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికేశాయి. ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగుతుంది. ఇక రోహిత్‌కు డిప్యూటీగా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు.
ఆగష్టు 30న పాకిస్థాన్, నేపాల్ మధ్య మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2న టీం ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్ ఎదుర్కునే తొలి సవాల్ పాకిస్థాన్‌తోనే. ఈ రెండు జట్లు శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బీలో కలిపి మొత్తంగా 6 జట్లు ఈ టోర్నీలో ఆద్యంతం తలబడనున్నాయి. భారత్, పాకిస్థాన్‌లు గ్రూప్-ఏలో చోటు దక్కించుకున్నాయి. ఇక ఆసియా కప్‌లో టీమ్ ఇండియా షెడ్యూల్ విషయానికొస్తే.. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్, సెప్టెంబర్ 4న నేపాల్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది.
The Asia Cup 2023 schedule is out! The high-octane tournament will take place from 30th August to 17th September. Mark your calendars for an adrenaline-packed tournament filled with fierce competition and unforgettable moments! 🏆https://t.co/Mmlx5hm39I#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) July 19, 2023
సూపర్ 4లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ కూడా జరగొచ్చు..
సెప్టెంబర్ 10న సూపర్ 4లో మళ్లీ భీకర పోరు జరగనుంది. గ్రూప్-ఏలోని టాప్-2 జట్లు కొలంబోలో తలపడతాయి. అంటే భారత్, పాక్‌ల మధ్య మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉంది. మరోవైపు, సెప్టెంబర్ 12న, గ్రూప్ ఏలో రెండవ స్థానంలో నిలిచిన జట్టు కొలంబోలో గ్రూప్-బీలోని అగ్రస్థానంలో ఉండే జట్టుతో, సెప్టెంబర్ 15న గ్రూప్-బీలోని రెండో స్థానంలో ఉన్న టీంతో తలబడుతుంది.
Here’s a look at the Pakistan squad for the Men’s ODI #AsiaCup2023! 🇵🇰
Babar Azam will lead the team with Shadab as his deputy. Rizwan and Haris are the wicketkeepers and the pace battery will be spearheaded by Shaheen Shah Afridi!
Can they combine well and clinch the title? 🤩 pic.twitter.com/1RUWZy3Ilk
— AsianCricketCouncil (@ACCMedia1) August 10, 2023
రెండోస్థానంలో టీమిండియా..
గ్రూప్-ఏలో నేపాల్ జట్టు చివరి స్థానంలో.. భారత్, పాకిస్థాన్ జట్లు ఒకటి, రెండు స్థానాల్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు పాకిస్థాన్ కంటే ఎక్కువ పాయింట్లు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే సెప్టెంబర్ 12, 15 తేదీల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లకు చెందిన ఏదైనా ఒక జట్టుతో రోహిత్ సేన తలబడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17న, సూపర్ ఫోర్‌లో మొదటి రెండు జట్లతో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక అప్పుడు కూడా భారత్, పాకిస్థాన్ జట్లే మూడోసారి తలపడవచ్చు.
Get ready to witness cricketing brilliance as India unveils its power-packed squad for the upcoming Men’s ODI #AsiaCup2023!
The mix of experience and youth, guided by stellar leadership, is primed to dominate the cricketing arena! 🇮🇳#ACC pic.twitter.com/ch6Fj6fQG6
— AsianCricketCouncil (@ACCMedia1) August 21, 2023
ఆసియా కప్ 2023కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
స్టాండ్ బై: సంజూ శాంసన్
