ICC Test Ranking: కోహ్లీకి భారీ షాక్.. ఆరేళ్ల తర్వాత టాప్ 10 నుంచి ఔట్.. ప్రమోషన్ పొందిన పంత్..

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మరోసారి తన బ్యాడ్ ప్రదర్శించిన విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుంచి పడిపోయాడు. విరాట్ కోహ్లి ఆరేళ్ల తర్వాత టాప్ టెన్ నుంచి కిందికి పడిపోయాడు.

ICC Test Ranking: కోహ్లీకి భారీ షాక్.. ఆరేళ్ల తర్వాత టాప్ 10 నుంచి ఔట్.. ప్రమోషన్ పొందిన పంత్..
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jul 06, 2022 | 3:09 PM

విరాట్ కోహ్లీ రెండున్నరేళ్లకు పైగా సెంచరీ చేయలేక, తన బ్యాడ్ ఫాంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుంచి విరాట్ కోహ్లీ కూడా తప్పుకున్నాడు. బుధవారం విడుదల చేసిన కొత్త టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 13వ స్థానానికి పడిపోయాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ 10వ ర్యాంక్‌లో ఉన్నాడు. పేలవమైన ప్రదర్శన కారణంగా 3 స్థానాల కిందకు పడిపోయాడు. అతని స్థానంలో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన జానీ బెయిర్‌స్టో దూసుకొచ్చాడు. బెయిర్‌స్టో 10వ స్థానానికి ఎగబాకాడు. విరాట్ కోహ్లీ గత 6 సంవత్సరాలుగా టాప్ 10లోనే కొనసాగుతున్నాడు. అయితే 2053 రోజుల తర్వాత కోహ్లీ, ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

బ్యాడ్ ఫాంకు కేరాఫ్ అడ్రస్..

విరాట్ కోహ్లీ టాప్ 10లో ఉండకపోవడానికి అతని నిరంతర పేలవమైన ప్రదర్శనే కారణమని తెలుసుకోవచ్చు. విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా టెస్టు క్రికెట్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ గత రెండేళ్లలో 16 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్‌తో 29.78 సగటుతో 834 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో విరాట్‌ బ్యాట్‌ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. విరాట్ కేవలం 6 అర్ధ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. జీరో స్కోర్ వద్ద 4 సార్లు ఔట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ దూకుడు..

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ నంబర్‌ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. 900 కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్స్‌గా జో రూట్ నిలిచాడు. 879 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లాబుస్‌చాగ్నే రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో, బాబర్ ఆజం నాలుగో స్థానంలో ఉన్నారు. టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. పంత్‌ భారత టాప్‌ టెస్టు ర్యాంకింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా నిలవగా, రోహిత్‌ శర్మ 9వ స్థానంలో ఉన్నాడు.

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!