Dinesh Karthik: 600 రూబిక్ క్యూబ్‌లతో డీకే పోర్ట్రెయిట్ రూపొందించిన బాలుడు.. టీమిండియా నయా ఫినిషర్ రియాక్షన్ ఏంటంటే..
Dinesh Karthik: ఐపీఎల్-2022 లో అద్భుత ఫర్మామెన్స్‌తో మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించాడు సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik). ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తనకు అప్పగించిన ఫినిషింగ్ బాధ్యతలను..
Dinesh Karthik: ఐపీఎల్-2022 లో అద్భుత ఫర్మామెన్స్‌తో మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించాడు సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik). ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తనకు అప్పగించిన ఫినిషింగ్ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. రేపటి నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కౌంటీ జట్టులతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో భారత జట్టు కెప్టెన్‌గా డీకే వ్యవహరించాడు. కాగా తన కెరీర్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం దినేశ్‌కు ఇదే తొలిసారి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది. ఈ క్రమంలో కార్తీక్‌పై పృథ్వీష్ (Pritveesh) అనే బాలుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. మొజాయిక్ కళాకారుడైన పృథ్వీష్ 600 రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి కార్తీక్ చిత్రాన్ని రూపొందించాడు.
Very nice work prithvi . Highly impressive ??❤️ https://t.co/D6GxnlyEJA
ఇవి కూడా చదవండి— DK (@DineshKarthik) July 4, 2022
దీనికి సంబంధించిన వీడియోను పృథ్వీష్ తన ట్విటర్‌లో షేర్ చేశాడు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా భారీ పోర్ట్రెయిట్ రూపొందించిన పృథ్వీశ్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురిస్తోంది. క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా ఈ పోర్ట్రెయిట్‌పై స్పందించాడు. ‘బాగా తాయారు చేశావు పృథ్వీ , ఇది నన్ను బాగా అకట్టుకుంది’ అని మెచ్చుకున్నాడు. కాగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రేపు మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..