AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆ రికార్డ్‌లో ఏకైక ఆటగాడిగా నిలిచిన భారత మాజీ సారథి.. అదేంటంటే?

Virat Kohli World Cup Records: ఈ టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. 6 ఇన్నింగ్స్‌ల్లో 98.67 సగటుతో 296 పరుగులు చేసి, టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు

Virat Kohli: ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఆ రికార్డ్‌లో ఏకైక ఆటగాడిగా నిలిచిన భారత మాజీ సారథి.. అదేంటంటే?
Virat Kohli
Venkata Chari
|

Updated on: Nov 14, 2022 | 3:47 PM

Share

విరాట్ కోహ్లి బరిలోకి దిగిన ప్రతీసారి తన పేరిట కొన్ని కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ రికార్డులు సృష్టించడం ఆయనకు అలవాటుగా మారింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి, ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 50+ పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ నిలిచాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లోనూ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

ఈ ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్ కోహ్లీనే..

ఈ టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 6 ఇన్నింగ్స్‌ల్లో 98.67 సగటుతో 296 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 136.41గా నిలిచింది. అతని ఇన్నింగ్స్‌లో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 82 నాటౌట్‌గా నిలిచింది. అదే సమయంలో అతను 3 సార్లు నాటౌట్‌గా నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ అత్యధిక పరుగులు చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2014 టీ20 ప్రపంచకప్‌లో 319 పరుగులు, 2016లో 296 పరుగులు చేశాడు. రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ..

ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తన T20 ఇంటర్నేషనల్‌లో 4000 పరుగులు పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్‌లో అతని సగటు 52.73గా ఉంది. కోహ్లీ స్ట్రైక్ రేట్ 137.96గా ఉంది. ఇది కాకుండా అతను 1 సెంచరీ, 37 అర్ధ సెంచరీలు చేశాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోరర్‌గా..

ఈ ప్రపంచకప్‌లో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులను కూడా కోహ్లీ పూర్తి చేశాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనేని వెనక్కి నెట్టి ఈ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఇప్పటివరకు 1141 పరుగులు చేశాడు. అతను 81.50 సగటుతో పరుగులు చేశాడు. అదే సమయంలో మహేల జయవర్ధనే 1016 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..