Video: దటీజ్ రోహిత్.. ఫుల్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నా.. లేడీ ఫ్యాన్‌కు బర్త్‌డే విషెస్.. వైరల్ వీడియో
Rohit Sharma viral video with Fan Girl: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంటాడు. ఆఫ్‌ఫీల్డ్ లేదా ఆన్‌ఫీల్డ్ అయినా, రోహిత్ శర్మ తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడం కనిపిస్తుంది. ఇప్పటికే ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. క్రికెట్ ఫీల్డ్‌లో అతని బ్యాటింగ్ లేదా కెప్టెన్‌గా ఉన్నప్పుడు రోహిత్ దేశీ యాస, అభిమానులను ఆకట్టుకుంటుంది.
Rohit Sharma viral video with Fan Girl: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంటాడు. ఆఫ్‌ఫీల్డ్ లేదా ఆన్‌ఫీల్డ్ అయినా, రోహిత్ శర్మ తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడం కనిపిస్తుంది. ఇప్పటికే ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. క్రికెట్ ఫీల్డ్‌లో అతని బ్యాటింగ్ లేదా కెప్టెన్‌గా ఉన్నప్పుడు రోహిత్ దేశీ యాస, అభిమానులను ఆకట్టుకుంటుంది. అందుకే ఆయన్ను చూడాలని అభిమానులు ఆరాటపడుతుంటారు.
తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ అభిమాన క్రికెటర్‌ని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. రోహిత్ శర్మ స్వయంగా ఒక అభిమానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం చూడొచ్చు. దీంతో ఆ అభిమానికి ఎక్కడాలేని ఉత్సాహంతో ఎగిరి గంతులేసింది. రోహిత్ ఈ వైరల్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రోహిత్..
Captain Rohit Sharma spotted in Mumbai streets today. Then he met a cute fangirl whose birthday it was and Rohit wished her happy birthday.🥹❤️
Look at her happiness what a wonderful birthday for her.🥹❤️ Thank you boss @ImRo45 🐐🙇🏼♂️ pic.twitter.com/OBWzQWFfSk
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 8, 2024
ట్రాఫిక్ కారణంగా రద్దీగా ఉండే ముంబై రోడ్డుపై రోహిత్ శర్మ ఇరుక్కుపోయాడు. ఈ సమయంలోనే ఈ వీడియో తీశారు. అప్పుడు రోహిత్ శర్మ లంబోర్ఘినిలో వెళ్తున్నాడు. ఆ సమయంలో అందరూ హిట్‌మ్యాన్ ఫొటోలు క్లిక్ చేస్తున్నారు. పక్కన ఒక అమ్మాయి ఉంది. అప్పుడు ఒక వ్యక్తి ఈ రోజు ఆమె పుట్టినరోజు అంటూ రోహిత్‌కు చెప్పాడు. రోహిత్, బ్లూ లగ్జరీ కారులో కూర్చుని, ఆ అమ్మాయితో కరచాలనం చేసి, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కూడా రోహిత్ శర్మకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటు, రోహిత్ తన అభిమానులను కలుసుకున్నందుకు ప్రశంసలు అందుకుంటున్నాడు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో లంబోర్ఘిని నుంచి మెర్సిడెస్, బీఎండబ్ల్యూ వరకు ఇలా ఎన్నో కార్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మకు అవకాశం దొరికినప్పుడల్లా డ్రైవ్‌కు వెళ్తుంటాడు. చాలా సార్లు రోహిత్ శర్మ స్వయంగా కారు నడుపుతూ కనిపిస్తుంటాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..