Team India: 7 నిమిషాలు.. 4 బంతులు.. 2 సార్లు డకౌట్.. కొత్త ఏడాదిలో తొలి పరుగు కోసం ఎదురుచూపులు..
India vs Afghanistan 3rd T20I: అయితే బెంగళూరులో జరగనున్న మూడో టీ20లో ఇది జరుగుతుందా? టీ20 ప్రపంచకప్‌నకు ముందు అంతర్జాతీయ క్రికెట్ పిచ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి అవకాశం. అంటే, దీని తర్వాత అతను వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరిగే ప్రపంచకప్‌లో నేరుగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో, అతను ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తిరిగి ట్రాక్‌లోకి వస్తాడా లేదా పట్టాలు తప్పుతాడా అనేది బెంగళూరులో అతని ప్రదర్శనతో తేలనుంది.
India vs Afghanistan 3rd T20I, Rohit Sharma Records: అఫ్గానిస్థాన్ బలమైన ప్రత్యర్థి భారత్‌తో టీ20 సిరీస్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, భారత సారథి రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన ప్రభావంతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. అయితే, మిగతా సభ్యులు రాణించడంతో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అంటే టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ గెలిచింది. ఇక బెంగళూరులో ఆడబోయే మూడవ T20I లో కూడా క్లీన్ స్వీప్ చేయగలదని తెలుస్తోంది. అయితే, రోహిత్ శర్మ ఫామ్ గురించి మాత్రం ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది వివాదాస్పదంగా మారకముందే, రోహిత్ మళ్లీ ఫామ్‌లోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే, టీమిండియా ఈ మ్యా్చ్ తర్వాత మరే సిరీస్ ఆడదు. నేరుగా టీ20 ప్రపంచకప్ ఆడనుంది. అయితే, దీనికి చాలా సమయం ఉంది. ఈలోగా రోహిత్ తన పాత ఫాం సంతరించుకోవాలి.
అయితే బెంగళూరులో జరగనున్న మూడో టీ20లో ఇది జరుగుతుందా? టీ20 ప్రపంచకప్‌నకు ముందు అంతర్జాతీయ క్రికెట్ పిచ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి అవకాశం. అంటే, దీని తర్వాత అతను వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరిగే ప్రపంచకప్‌లో నేరుగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో, అతను ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తిరిగి ట్రాక్‌లోకి వస్తాడా లేదా పట్టాలు తప్పుతాడా అనేది బెంగళూరులో అతని ప్రదర్శనతో తేలనుంది.
7 నిమిషాల్లో రెండుసార్లు ఔట్..
మొహాలీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మ క్రీజులో ఒక్క నిమిషం మాత్రమే గడపగలిగాడు. కేవలం 1 బంతి మాత్రమే ఆడి రనౌట్ అయ్యాడు. ఖాతా తెరవలేకపోయాడు. మొహాలీ రనౌట్‌ను అభిమానులు పీడ కలగా మరచిపోవడానికి ప్రయత్నించారు. అయితే, ఇండోర్‌లో జరిగిన రెండవ T20లో అదే దృశ్యం కనిపించింది. ఈ సమయంలో రోహిత్ క్రీజులో 6 నిమిషాలు గడిపాడు. 3 బంతులు ఎదుర్కొన్నాడు. కానీ, పరుగులు చేయకుండానే బౌల్డ్ అయ్యాడు. ఇలా 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు ఔట్ అయ్యాడు. అయితే, ఒక్క పరుగు కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. కొత్త సంవత్సరంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ జీరోకే వెనుదిరగాల్సి వచ్చింది.
బెంగళూరులో రికార్డు మరింత దారుణంగా..
ఇప్పుడు కొత్త సంవత్సరంలో మూడో టీ20 మ్యాచ్ ఆడేందుకు బెంగళూరు వంతు వచ్చింది. ప్రత్యర్థి కూడా సేమ్. కాబట్టి ఫలితం ఇలాగే ఉంటుందా? మారుతుందా? అనేది చూడాలి. మొహాలీ నుంచి ఇండోర్‌కి పెద్దగా మారలేదు. బెంగళూరులో కూడా రోహిత్ శర్మ గణాంకాలు చూస్తే గత రెండు మ్యాచ్‌ల దృశ్యం కళ్ల ముందు కనిపిస్తోంది.
బెంగళూరులో ఆడిన 3 T20Iలలో, రోహిత్ శర్మ మొత్తం 29 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతని అత్యుత్తమ స్కోరు 18 పరుగులు. ఇది కాకుండా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరు కూడా దాటలేదు. అవును, బెంగళూరులో ఆడిన చివరి మూడు T20I ఇన్నింగ్స్‌లలో అతను ఖాతా తెరవడంలో విజయం సాధించాడు. అంటే, అతను సున్నాలో ఔట్ కాలేదు. ఈ ఒక్కటి కూడా సానుకూలంగా తీసుకుంటే, ఎం. చిన్నస్వామి స్టేడియంలో రోహిత్ శర్మ ఖాతా తెరుచుకునేలా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..