AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్థాన్ జట్టులో ముదిరిన సంక్షోభం.. రిటైర్మెంట్ చేయనున్న స్టార్ ప్లేయర్.. ఎందుకంటే?

Haris Rauf Retirement News: పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌లో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆ జట్టు న్యూజిలాండ్‌లో వరుసగా ఓటములను చవిచూస్తోంది. ఇంతలో, పాకిస్తాన్ నుంచి ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను తన రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరీస్ రవూఫ్ ఎందుకు ఇలా అన్నాడో దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Pakistan: పాకిస్థాన్ జట్టులో ముదిరిన సంక్షోభం.. రిటైర్మెంట్ చేయనున్న స్టార్ ప్లేయర్.. ఎందుకంటే?
Pakistan Team
Venkata Chari
|

Updated on: Jan 16, 2024 | 5:12 PM

Share

Haris Rauf Retirement News: ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ-20 సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ జట్టు.. టీ-20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమవుతోంది. షాహీన్ షా అఫ్రిది కెప్టెన్సీలో పాకిస్థాన్ అత్యంత దయనీయ స్థితిలో ఉంది. ఎందుకంటే, పాక్ జట్టు మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇంతలో, పాకిస్తాన్ నుంచి ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను తన రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పాక్ మీడియా ప్రకారం, హారిస్ రవూఫ్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అతనికి వ్యతిరేకంగా చాలా వాతావరణం సృష్టించబడింది. దీంతో హరీస్ రవూఫ్, అతని కుటుంబం ఇబ్బంది పడి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

జట్టులో గందరగోళం..!

హరీస్ రవూఫ్ ముందుగా టెస్ట్ సిరీస్ ఆడేందుకు అంగీకరించాడని, అయితే తర్వాత అతను వెనక్కి తగ్గాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, హరీస్ రవూఫ్ మాత్రం పని భారం నిర్వహణ కారణంగా విరామం తీసుకోవాలని, అప్పటికే మేనేజ్‌మెంట్‌కి చెప్పాడని, యాజమాన్యం కూడా దీనికి అంగీకరించిందని, అయితే ఆ తరువాత విషయం వేరేగా మారిందని అంటున్నారు.

హారిస్ రవూఫ్ భారతదేశంలో జరిగిన ODI ప్రపంచ కప్ సందర్భంగా, అప్పటి కోచ్ మిక్కీ ఆర్థర్‌కు అతని శరీరం ప్రస్తుతం ఒత్తిడిని తట్టుకోలేకపోతుందని, ప్రపంచ కప్ తర్వాత విశ్రాంతి అవసరమని చెప్పుకొచ్చాడు. కానీ ప్రపంచ కప్ తర్వాత, మిక్కీ ఆర్థర్ పాక్ జట్టు నుంచి తొలగించడం గమనార్హం.

30 ఏళ్ల హరీస్ రౌఫ్ ప్రస్తుతం పాకిస్థాన్ ఫాస్టెస్ట్ బౌలర్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. ఇప్పటి వరకు అతను పాకిస్థాన్ తరపున ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతను 37 వన్డేలు, 64 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ చారిత్రాత్మక షాట్‌లను బాదిన బౌలర్ హరీస్ రౌఫ్ అనే సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..