Rohit Sharma: టీమిండియా ఓటమిపై స్పందించిన రోహిత్.. ఏమన్నారంటే?

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టులో భారత్‌‌ను ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమి కారణంగా భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లే దారులు అన్ని మూసుకున్నాయి. అయితే తాజాగా బాక్సింగ్ డే టెస్టు ఓటమిపై రోహిత్ శర్మ స్పందించాడు. ఈ ఓటమి తమను నిరాశపరిచిందని పేర్కొన్నాడు.

Rohit Sharma: టీమిండియా ఓటమిపై స్పందించిన రోహిత్.. ఏమన్నారంటే?
Rohith Sharma
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 30, 2024 | 3:16 PM

నాలుగో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు భారత్ అద్భుతంగా పుంజుకుంది. నాలుగో రోజు కూడా భారత్ మంచి ప్రదర్శన చేసింది. కానీ చివరి సెషన్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్‌లు చేతులు ఎత్తేయడంతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ను కైవసం చేసుకుని ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. దీంతో సిరీస్‌ను కాపాడుకోవడం ఇప్పుడు భారత్‌కు పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సంబంధించిన లెక్కలు కూడా తారుమారయ్యాయి. ఫైనల్ కల దాదాపుగా చెదిరిపోయిందని చెప్పవచ్చు. ఐతే నాలుగో మ్యాచ్‌లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ నిరాశగా కనిపించాడు. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఐదో మ్యాచ్ జనవరి 3 నుంచి జరగనుంది.

సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్న జట్టుగా రాణించగల అవకాశం ఉందని.. ఈ మ్యాచ్‌ని బాగా ఆడేందుకు ప్రయత్నిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. సిరీస్‌ను సమం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసించాడు. ఈ సందర్బంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘బుమ్రా నిజంగా మంచి బౌలర్. మీరు అతన్ని చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. మీరు అతని ప్రదర్శనను కూడా నాలుగో టెస్టులో చూడవచ్చు. బుమ్రా జట్టును గెలిపించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అతనిని వేరే బౌలర్ల నుంచి సరైన మద్దతు రావడం లేదని” పేర్కొన్నాడు. అలాగే తన ప్రదర్శనపై రోహిత్ శర్మ స్పందించాడు. “కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కొన్ని ఫలితాలు అనుకూలంగా రాలేదు. ఇది నిరాశపరిచింది. మానసికంగా ఇబ్బంది పెడుతోంది. జట్టుగా కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి నిరాశపరిచిందని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. నితీశ్ కూమార్ మంచి ఫ్యూచర్ ఉందని కొనియాడారు. 340 రన్స్ అంటే అంత ఈజీ కాదని, ఇంకా జట్టు ఇంప్రూవ్ కావాలని పేర్కొన్నాడు. సీడ్నీలో టెస్టులో మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..