AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అమరావతికి వచ్చేయండి… టాలీవుడ్ పై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

టాలీవుడ్‌కి అడ్డా.. హైదరాబాద్ గడ్డ. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో తెలుగు సినిమా ఇండస్ట్రీ పాతుకుపోయింది. ఇప్పుడు ఈ టాలీవుడ్‌కు మరోనగరం రెండో వేదిక కాబోతోందా.? సీఎం చంద్రబాబు చేపట్టబోయే కార్యాచరణ ఏంటి? త్వరలోనే అమరావతికి టాలీవుడ్ ఇండస్ట్రీ పయనమవుతుందా.? అసలు చంద్రబాబు ఏమన్నారంటే..

Tollywood : అమరావతికి వచ్చేయండి... టాలీవుడ్ పై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
CM Chandrababu
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2025 | 8:00 AM

Share

తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌ని దాటేశాయి. లోకల్ కాదు.. ఇంటర్నేషనల్ అనే రేంజ్‌కి టాలీవుడ్ ఎదిగింది. కాసుల వర్షంలో రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తున్నాయి తెలుగు సినిమాలు. ముఖ్యంగా రెండు, మూడేళ్లుగా పాన్ ఇండియాను తెలుగు సినిమాలు శాసిస్తున్నాయి. మిగిలిన వుడ్‌లతో పోలిస్తే టాలీవుడ్ అదరగొడుతుందనే చెప్పాలి. చూస్తుండగానే ఆకాశమంత ఎదిగిన టాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డాగా మారింది. మద్రాస్ నుంచి తరలివచ్చాక హైదరాబాద్‌లో టాలీవుడ్ స్థిరపడిపోయింది. నగరంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్‌లకు అవకాశాలు, భారీ స్టూడియోలు ఉండటం ప్లస్ పాయింట్. ఇక నగరంలో ఉన్న సదుపాయాలు కూడా టాలీవుడ్‌ను ఆకర్షించాయి.

అయితే ఇటీవల సంధ్య థియేటర్ ఘటన.. తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. అమరావతి నిర్మాణం పూర్తైతే సినిమాలన్నీ ఇక ఏపీలోనే అంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో అమరావతి నగరంలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కల్పించిన అవకాశాల వల్లే టాలీవుడ్‌కు ఇప్పుడు హైదరాబాద్ హబ్​గా మారిందన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందన్నారు. టాలీవుడ్‌కు అమరావతిలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే టాలీవుడ్‌ను ప్రోత్సహించడానికి అవసరమైన సదుపాయాలు, ప్రోత్సాహకాలు అందించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమరావతి వేదిక కాబోతోంది. హైదరాబాద్‌లో మాదిరిగానే అమరావతిలో పెద్ద పెద్ద స్టూడియోలు వస్తాయనీ.. ఏపీలో అధిక సంఖ్యలో షూటింగ్‌లు జరిగే అవకాశం ఉందనీ టాక్ ఆప్ ది టాలీవుడ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.