AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కనిపించకుండా పోయిన వ్యాపారి శవమై తేలాడు.. ఒక డెడ్‌బాడీ ఎన్నో అనుమానాలు?

హైదరాబాద్ మహానగరం పంజాగుట్టకు చెందిన వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన దుండగులు హతమార్చారు. డిసెంబర్ 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని ఎస్సార్ నగర్‌ కాలనీలో విగతజీవిగా కనిపించాడు. కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Telangana: కనిపించకుండా పోయిన వ్యాపారి శవమై తేలాడు.. ఒక డెడ్‌బాడీ ఎన్నో అనుమానాలు?
Vishnu Roopani
Balaraju Goud
|

Updated on: Jan 02, 2025 | 8:12 AM

Share

హైదరాబాద్ పంజాగుట్టలో కనిపించకుండపోయిన వ్యాపారి శవమై తేలడం అనుమానాలకు తావిస్తోంది. ఎల్లారెడ్డిగూడకి చెందిన విష్ణు రూపాని డిసెంబర్ 28న అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలతోపాటు సాంకేతి ఆధారాలతో గాలింపు చేపట్టారు. అయితే ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ పోలీసులకు చేరింది.

బుద్ధనగర్ బస్తీలో ఓ భవనంలో నుంచి దుర్వాసన వస్తుందని స్ధానికులు ఎస్సార్‌ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. అది విష్ణు రూపాని డెడ్‌బాడీగా తేల్చారు పోలీసులు. మృతదేహం లభ్యమైన చోట విష్ణు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.

అయితే ఏం జరిగిందనేది అంతుచిక్కడం లేదు. మృతుడు డెడ్‌బాడీపై ఎలాంటి గాయాలు లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్య జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..