Team India: తొలుత బీసీసీఐ.. ఆ తర్వాత ఐపీఎల్ ఛీ కొట్టాయి.. కట్‌చేస్తే.. ఇప్పుడేమో ఏకంగా..
Team India: ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 9 వరకు చెన్నైలో జరగనున్న ఆల్ ఇండియా బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ఓ టీమిండియా అన్ లక్కీ ప్లేయర్ మహారాష్ట్ర తరపున ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అంకిత్ బావ్నే సారథ్యంలో మహారాష్ట్ర జట్టు బరిలోకి దిగుతోంది. జట్టులో రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

Prithvi Shaw to Make Maharashtra Debut in Buchi Babu Tournament: ఒకప్పుడు టీమిండియాలో సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ పృథ్వీ షా, తన కెరీర్‌కు కొత్త దిశానిర్దేశం చేయడానికి సిద్ధమవుతున్నాడు. గత కొంతకాలంగా ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న షా, ముంబై క్రికెట్ జట్టును వీడి మహారాష్ట్ర తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ కొత్త ప్రయాణానికి తొలి అడుగుగా, చెన్నైలో జరగనున్న బుచ్చి బాబు టోర్నమెంట్‌లో మహారాష్ట్ర జట్టు తరపున బరిలోకి దిగుతున్నాడు.
ముంబైకి గుడ్‌బై చెప్పడానికి కారణాలు..
పృథ్వీ షా ముంబై జట్టుకు కీలక ఆటగాడిగా ఉండేవాడు. అయితే, గత సీజన్‌లో అతని ఫిట్‌నెస్, క్రమశిక్షణ లోపాల కారణంగా రంజీ ట్రోఫీ జట్టు నుంచి అతడిని తప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, తన కెరీర్‌కు కొత్త ఊపిరి పోసుకోవాలనే ఉద్దేశంతో మహారాష్ట్రకు మారాలని నిర్ణయించుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ‘నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) పొందిన తర్వాత ఈ బదిలీ ప్రక్రియ పూర్తయింది.
బుచ్చి బాబు టోర్నమెంట్‌తో కొత్త అధ్యాయం..
ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 9 వరకు చెన్నైలో జరగనున్న ఆల్ ఇండియా బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో పృథ్వీ షా మహారాష్ట్ర తరపున ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అంకిత్ బావ్నే సారథ్యంలో మహారాష్ట్ర జట్టు బరిలోకి దిగుతోంది. జట్టులో రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఉన్నారు. రుతురాజ్, వికెట్ కీపర్ సౌరభ్ నవాలే దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్ జోన్ జట్టుతో చేరాల్సి ఉన్నందున, వారు ఒక మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం ఉంది. కానీ, పృథ్వీ షాకు మాత్రం ఈ టోర్నీ తన ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించడానికి ఒక మంచి అవకాశం.
భవిష్యత్తుపై ఆశలు..
18 సంవత్సరాల వయసులోనే టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసి సంచలనం సృష్టించిన పృథ్వీ షా, ఆ తర్వాత ఫామ్ కోల్పోయి భారత జట్టు నుంచి దూరమయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా అమ్ముడుపోలేదు. ఇప్పుడు మహారాష్ట్ర తరఫున ఆడుతూ, దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటి, తిరిగి టీమిండియాలోకి రావాలని షా ఆశిస్తున్నాడు. ఈ బుచ్చి బాబు టోర్నమెంట్ షా కెరీర్‌కు పునరుజ్జీవం పోస్తుందని అతని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








