
ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్ -పాకిస్థాన్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరగనుంది . మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఈ మహా సంగ్రామాన్ని చూసేందుకు క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దాయాదుల పోరుకు వరుణుడు అడ్డుపడవచ్చని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. మెల్‌బోర్న్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పుడీ వర్షం కాస్తా తగ్గుముఖం పట్టింది. పూర్తి ఓవర్ల మ్యాచ్ జరగకున్నా కొద్దిపాటి ఓవర్లతో మ్యాచ్ జరగవచ్చని అక్కడి జర్నలిస్టులు చెబుతున్నారు. కాగా లానినా తుపాన్ కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో చల్లటి గాలి వీస్తోంది. ఫలితంగా ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదిక తెలిపింది . ప్రధానంగా బ్రిస్బేన్ , సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక అక్టోబర్ 23 న మెల్‌బోర్న్‌లో 80 శాతం వర్షం కురుస్తుందట. ఈ నేపథ్యంలో భారత్ , పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగడం అనుమానమేనని స్కై న్యూస్ వాతావరణ నిపుణుడు రాబ్ షార్ప్ తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో కూడావరద ముంపు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది .
అయితే ఇప్పుడొస్తున్న వార్తల ప్రకారం మెల్‌బోర్న్‌లో వర్షం తగ్గింది. శనివారం చిన్నపాటి వర్షం మాత్రమే కురిసింది . ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం వరకు మెల్‌బోర్న్‌లో వర్షం పడే సూచన లేదు. అయితే సాయంత్రం కాస్త వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు . ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కావడం ఖాయం. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్ పూర్తిగా నిలిచిపోతుంది . ఒకవేళ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల వరకు వేచి చూస్తారు. మధ్యలో వర్షం ఆగితే ఓవర్ కట్‌తో మ్యాచ్‌ను ప్రారంభించవచ్చు . మ్యాచ్‌కి కటాఫ్ సమయాన్ని నిర్ణయించిన తర్వాత, వర్షం ఆగితే , రెండు జట్లకు 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడవచ్చు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వబడుతుంది. రిజర్వ్ డే లేదు.
అనేక కారణాల వల్ల భారత్-పాకిస్థాన్ మధ్య ఈ మ్యాచ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది . గత ఏడాది వరకు, 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్ల ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా అజేయంగా ఉంది . అయితే దుబాయ్‌లో జరిగిన T20 వరల్డ్ కప్ 2021 మ్యాచ్‌లో ఈ విజయ పరంపరకు బ్రేక్ పడింది . ఆ మ్యాచ్‌లో కోహ్లీ సేనపై పాకిస్థాన్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది . కాబట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.
It’s overcast in Melbourne but the forecast has improved a lot and there now appears to be just a small chance of any showers this evening. ?? #T20WorldCup #INDvPAK
— Melinda Farrell (@melindafarrell) October 22, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..