IND vs PAK T20 Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం.. హాఫ్ సెంచరీతో సత్తా చాటిన కోహ్లీ..

|

Updated on: Oct 23, 2022 | 5:47 PM

పాకిస్థాన్‌తో జరుగుతున్న గ్రేట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంతకు ముందు టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 3సార్లు టాస్ గెలవగా, 3 మ్యాచ్‌ల్లోనూ గెలిచింది.

IND vs PAK T20 Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం.. హాఫ్ సెంచరీతో సత్తా చాటిన కోహ్లీ..
Ind Vs Pak T20 Live Score

టీ20 వరల్డ్ కప్ 2022 లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీపావళి సందర్భంగా టీమిండియా అభిమానులకు విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా భారత్ చివరి ఓవర్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ తుఫాను ప్రదర్శన ఇచ్చాడు. 82 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్‌లాగే భారత్‌కు కూడా ఆరంభం అంతగా బాగోలేదు. మొదటి 4 వికెట్లను చాలా త్వరగా కోల్పోయింది. అయితే కోహ్లి, హార్దిక్ పాండ్యా ముందున్నారు. కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. 2 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు.

రోహిత్-రాహుల్ మరోసారి విఫలం..

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ విఫలమయ్యారు. 4 పరుగుల వద్ద రోహిత్ ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా 4 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు ఉన్నాయి. అక్షర్ పటేల్ కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతను రనౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ 1 పరుగు చేసి ఔటయ్యాడు. చివరి ఓవర్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్యాటింగ్‌కు వచ్చి చివరి బంతికి 1 పరుగు తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయం సాధించింది.

ఇరు జట్లు..

టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్తాన్ ప్లేయింగ్ XI: బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 23 Oct 2022 05:46 PM (IST)

    ఉత్కంఠ మ్యాచ్‌లో టీమిండియాదే విజయం..

    టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌-భారత్‌ మధ్య జరిగిన గ్రేట్‌ మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై క్రీజులోకి వచ్చిన కోహ్లి, హార్దిక్ లు 78 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి క్షణంలో హార్దిక్ ఔటయ్యాడు, కానీ ఛేజ్ మాస్టర్ కోహ్లీ చివరి వరకు నిలిచి, టీమిండియాను గెలిపించాడు.

  • 23 Oct 2022 05:26 PM (IST)

    బోణీ కొట్టిన భారత్..

    ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ ఇచ్చిన టార్గెట్‌ను టీమిండియా చివరి ఓవర్‌లో విజయం సాధించింది.

  • 23 Oct 2022 05:03 PM (IST)

    కోహ్లీ హాఫ్ సెంచరీ..

    విరాట్ కోహ్లీ కీలక సమయంలో హాఫ్ సెంచరీతో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో తన హాఫ్ సెంచరీ చేశాడు.

  • 23 Oct 2022 04:42 PM (IST)

    భారతమంతా కోహ్లీ, హార్దిక్ పైనే..

     కష్టాల్లో ఉన్న టీమిండియాను విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కీలకమైన భాగస్వామ్యంతో ఆదుకుంటున్నారు. నలుగురు బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు చేరడంతో భారమంతా ఈ ఇద్దిపైనే ఉంది. భారత్ స్కోరు 13 ఓవర్లలో 83 పరుగులు. క్రీజులో కోహ్లి 28, హార్దిక్ 29 ఉన్నారు.

  • 23 Oct 2022 04:15 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియాను కష్టాలు వదలడం లేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో కూరుకపోయింది. అక్షర్ పటేల్(2) రనౌట్ అయ్యాడు. దీంతో 31 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

  • 23 Oct 2022 03:57 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరకపోయింది. కెప్టెన్ రోహిత్(4) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 10 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది.

  • 23 Oct 2022 03:48 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్..

    ఆదిలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(4) నషీమ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 7పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

  • 23 Oct 2022 03:29 PM (IST)

    టీమిండియా టార్గెట్ 160

    పాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత్ తరపున హార్దిక్, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. షమీ, భువీ ఖాతాల్లో ఓ వికెట్‌ చేరింది. పాండ్యా 14వ ఓవర్లో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను కష్టాల్లో పడేశాడు. పాకిస్థాన్ తరపున ఇఫ్తికర్ 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 4 సిక్సర్లు కూడా కొట్టాడు. షాన్ మసూద్ 52 పరుగులతో నాటౌ‌ట్‌గా నిలిచాడు.

  • 23 Oct 2022 03:04 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన పాక్..

    అర్షదీప్ మరో స్పెల్ బౌలింగ్‌కు దిగిన వెంటనే మరో వికెట్ పడగొట్టి, పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చాడు. దీంతో పాక్ ప్రస్తుతం 7వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.

  • 23 Oct 2022 02:59 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన పాక్..

    హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌తో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు వికెట్లు పడగొట్టిన ఈ భారత ఆల్ రౌండర్.. 16వ ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. మహ్మద్ నవాజ్(9) దినేష్ కార్తీక్‌కు క్యచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 23 Oct 2022 02:48 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన పాక్..

    పాకిస్తాన్ టీం వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకపోతోంది. హార్దిక్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి పాక్ జట్టును కష్టాల్లోకి నెట్టేశాడు. హైదర్ ఆలీ(2) భారీ షాట్ ఆడి, సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 23 Oct 2022 02:45 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన పాక్..

    షాబాద్ ఖాన్ (5) రూపంలో పాకిస్తాన్ 4 వికెట్‌ను కోల్పోయింది. హార్ధిక్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం పాక్ 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.

  • 23 Oct 2022 02:39 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన పాక్..

    ఎట్టకేలకు భారత బౌలర్ల ఎదురుచూపులు ఫలించాయి. ఇఫ్తికర్ అహ్మద్(51) వికెట్‌ను షమీ పడగొట్టాడు. దీంతో భారీ భాగస్వామ్యం తర్వాత టీమిండియా శిబిరంలో ఉత్సాహం నెలకొంది.

  • 23 Oct 2022 02:12 PM (IST)

    49 మ్యాచ్‌ల్లో కేవలం 3సార్లే ఇలా..

    పాక్ ఓపెనింగ్ జోడీ బాబర్, రిజ్వాన్‌లు 49 టీ20ల్లో తక్కువ స్కోర్‌కే కేవలం 3 సార్లే పెవిలియన్ చేరారు. కాగా, షాన్ మసూద్ రెండు సార్లు 50 ప్లస్(65, 56) స్కోర్లు నమోదు చేశాడు.

  • 23 Oct 2022 01:55 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌..

    పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో భారీషాట్‌ కు ప్రయత్నించిన మహ్మద్‌ రిజ్వాన్‌ బౌండరీ లైన్‌ వద్ద భువీకి చిక్కాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 4 ఓవర్లు ముగిసే సరికి 15/2

  • 23 Oct 2022 01:41 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పాక్..

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టుకు.. భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తన తొలి ఓవర్ వేస్తోన్న అర్షదీప్ సింగ్.. తొలి బంతికే డేజరస్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.

  • 23 Oct 2022 01:35 PM (IST)

    మొదలైన పాక్ బ్యాటింగ్..

    టాస్ ఓడిన పాకిస్తాన్ టీం బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా రిజ్వాన్, కెప్టెన్ బాబర్ బరిలోకి దిగారు.

  • 23 Oct 2022 01:29 PM (IST)

    ఎంసీజీలో చివరి 5 మ్యాచ్‌లు..

    ఎంసీజీలో జరిగిన చివరి 5 మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజయం సాధించింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు 175 పరుగులుగా నిలిచింది. శ్రీలంకపై ఆస్ట్రేలియా ఈ అత్యధిక స్కోర్ చేసింది.

  • 23 Oct 2022 01:27 PM (IST)

    37 ఏళ్ల తర్వాత ఎంసీజీలో దాయాది పోరు..

    37 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలోని ఎంసీజీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోందిరెండు జట్లు చివరిసారిగా 1985లో బెన్సన్ & హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆడాయి. భారత కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్‌కి ఇదే చివరి మ్యాచ్. ఆ తర్వాత ఈ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడూ మ్యాచ్ జరగలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.

  • 23 Oct 2022 01:25 PM (IST)

    పాక్‌పై టాస్ గెలిచిన ప్రతీసారీ టీమిండియాదే విజయం..

    ఇంతకు ముందు టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ మూడుసార్లు టాస్ గెలవగా, మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా గెలిచింది.

  • 23 Oct 2022 01:11 PM (IST)

    పంత్‌, చాహల్‌ కు నో ఛాన్స్‌..

    టీమిండియా తుది జట్టులో రిషబ్‌ పంత్‌ కు చోటు దక్కలేదు. అలాగే స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ కూడా డగౌట్‌కే పరిమితమయ్యాడు. పంత్ కంటే డీకేకే ప్రాధాన్యమిచ్చాడు రోహిత్‌. అలాగే స్పిన్‌ విభాగంలో అక్షర్‌, అశ్విన్‌లను తీసుకున్నారు.

  • 23 Oct 2022 01:08 PM (IST)

    టీమిండియా తుది జట్టు ఇదే

    రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

  • 23 Oct 2022 01:05 PM (IST)

    టాస్‌ గెలిచిన టీమిండియా..

    రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచకున్నాడు. దీంతో పాక్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది. కాగా మ్యాచ్‌ మధ్యలో వర్షం పడే అవకాశం ఉండడంతో లక్ష్య ఛేదనకే టీమిండియా మొగ్గు చూపింది.

  • 23 Oct 2022 12:39 PM (IST)

    టాస్‌ కీలకం..

    ఏ మ్యాచ్‌లోనైనా టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మొదట బౌలింగ్ చేసే జట్టుకు ఎప్పుడూ ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈరోజు కూడా వాతావరణంతో పాటు అందరి చూపు టాస్‌పైనే ఉంటుంది.

  • 23 Oct 2022 12:33 PM (IST)

    కిక్కిరిసిపోయిన స్టేడియం

    టాస్‌కు ఇంకా అరగంట సమయం ఉంది. అయితే ఇప్పటికే మెల్‌బోర్న్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇక వెదర్‌ విషయానికొస్తే.. మెల్‌బోర్న్‌లో వర్షం ముప్పి తప్పింది. ఎండ కూడా కాస్తుండడంతో షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌ జరగనుంది.

  • 23 Oct 2022 12:17 PM (IST)

    భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండొచ్చంటే?

    రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

  • 23 Oct 2022 11:39 AM (IST)

    షమీనా? హర్షల్‌ పటేల్‌నా?

    ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ కూర్పుపై ఒక అవగాహనకు వచ్చినా బౌలింగ్‌లో ఇంకా సంధిగ్ధత కొనసాగుతోంది. వార్మప్‌ మ్యాచ్‌లో రాణించిన షమీ కేవలం ఒకే ఓవర్‌ మాత్రమే వేశాడు. దీంతో అతనిని తుది జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అని తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. అలాగే హర్షల్‌ పటేల్‌ స్థానంపై కూడా గందరగోళం నెలకొంది. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కవచ్చు.

Published On - Oct 23,2022 11:35 AM

Follow us
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.