T20 World Cup 2021: మీ అంచనాలు అందుకోలేకపోయాను.. మీకంటే నేనే ఎక్కువ నిరాశ చెందాను..
ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ ఆటగాడు హసన్ అలీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శాలు వచ్చాయి. అతను క్యాచ్ మిస్ చేయడం వల్ల పాక్ ఓడిపోయిందని ట్రోల్ చేశారు. దీనిపై ఎట్టకేలకు హసన అలీ స్పందించాడు...

ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ ఆటగాడు హసన్ అలీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శాలు వచ్చాయి. అతను క్యాచ్ మిస్ చేయడం వల్ల పాక్ ఓడిపోయిందని ట్రోల్ చేశారు. దీనిపై ఎట్టకేలకు హసన అలీ స్పందించాడు. తనకు మద్దతుగా సందేశాలు పంపిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పాడు. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో హసన్ అలీ నాలుగు ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చాడు ఒక్క వికెట్ కూడా తీయలేదు. కీలక సమయంలో మాథ్యూ వేడ్ క్యాచ్ విడిచిపెట్టాడు.
“నా ప్రదర్శన మీ అంచనాలను అందుకోలేకపోయినందున మీరందరూ కలత చెందుతున్నారని నాకు తెలుసు. కానీ మీ కంటే నేనే ఎక్కువ నిరాశ చెందాను. నాపై మీ అంచనాలను మార్చుకోవద్దు. నేను పాకిస్తాన్ క్రికెట్‌కు సాధ్యమైనంత అత్యున్నత స్థాయిలో సేవ చేయాలనుకుంటున్నాను, కాబట్టి తిరిగి కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. ఈ ప్యాచ్ నన్ను బలపరుస్తుంది. అన్ని సందేశాలు, ట్వీట్‌లు, పోస్ట్‌లు, కాల్‌లు, దువాస్ (ప్రార్థనలు) చేసినవారికి ధన్యవాదాలు” అని 27 ఏళ్ల హసన్ అలీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమయ్యాయి. చివరి దశలో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ బంతిని గాల్లోకి లేపాడు. అది హసన్ అలీకి దగ్గరగా వెళ్లింది. కానీ అతడు క్యాచ్ విడిచిపెట్టాడు. దీంతో బతిపోయిన వేడ్ అఫ్రిది వేసిన తర్వాతి మూడు బంతులను సిక్సర్లుగా మాలిచాడు. “మేము ఆ క్యాచ్‌ని పట్టినట్లయితే మ్యాచ్ వేరేలా ఉండేది. కానీ మేము ఈ టోర్నమెంట్‌ను ఆడిన విధానం, మేము గెల్చిన విధానం, కెప్టెన్‌గా నేను చాలా సంతృప్తి చెందాను.” పాక్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు.
Read Also.. Virat Kohli: విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి.. రోహిత్ శర్మ ఎంపిక మంచి నిర్ణయం..



